ETV Bharat / politics

ఆ మూడు స్థానాలపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ - గెలుపే లక్ష్యంగా ప్రచారం - BRS FOCUS ON GREATER HYDERABAD

author img

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 8:29 AM IST

BRS Focus on Secunderabad, Chevella, Malkajgiri Constituencies : సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలపై భారత్ రాష్ట్ర సమితి ప్రత్యేకంగా దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు స్థానాల పరిధిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఆ విజయాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విస్తృతంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

Lok Sabha Elections 2024
BRS Focus on Secunderabad Constituency (ETV BHARATH)

ఆ మూడు స్థానాలపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ - గెలుపే లక్ష్యంగా ప్రచారం (ETV BHARAT)

BRS Focus on Secunderabad, Chevella, Malkajgiri Constituency : శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్‌తో పాటు శివారు నియోజకవర్గాలు బీఆర్​ఎస్​కు పూర్తి అండగా నిలిచాయి. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలను గులాబీ పార్టీ దక్కించుకొంది. మల్కాజ్‌గిరిలో ఏడింటికి ఏడు చోట్ల పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. సికింద్రాబాద్ పరిధిలో ఒక్క నాంపల్లి మినహా ఆరు స్థానాల్లో కారు విజయం సాధించింది. చేవెళ్ల పరిధిలోని నాలుగు సీట్లలో నెగ్గారు. ఖైరతాబాద్‌లో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌లో ప్రత్యర్థిగా మారారు. మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ పార్టీతోనే ఉన్నారు.

మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల మూడు లోక్‌సభ స్థానాలపై బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మూడు నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ తరచూ సమీక్షిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. వస్తున్న సమాచారం ఆధారంగా నేతలను అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అధినేత కేసీఆర్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

KTR Suggestions To BRS Leaders : నోటిఫికేషన్‌కు ముందే కేసీఆర్ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల పరిధిలో కేటీఆర్ ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. విస్తృతస్థాయి సమావేశాలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నగరవాసులకు ధన్యవాదాలు చెబుతూ లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మద్దతు అడుగుతున్నారు. గురువారం సికింద్రాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్‌లో, మల్కాజ్‌గిరి పరిధిలోని కూకట్‌పల్లిలో కేటీఆర్‌ రోడ్ షోలలో పాల్గొన్నారు.

అచ్చేదిన్‌ కాదు కాంగ్రెస్‌ వచ్చాక సచ్చేదిన్‌ వచ్చింది : కేటీఆర్‌ - KTR Lok Sabha Election campaign

"సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు ఇష్టమెచ్చినట్లు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక లంకెబిందెలు లేవనడం దారుణం. రేవంత్​ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్సు, ఉచిత హామీలు ఇచ్చి తన ఖాాతాలో రాసుకోమని చెబుతున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం లేదు." - కేటీఆర్ ,బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

KTR Road Show Schedule : శనివారం మేడ్చల్, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆదివారం ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్‌పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. సోమవారం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి. మంగళవారం సికింద్రాబాద్, సనత్‌నగర్‌, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారంలో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు పాల్గొంటారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక కూడా జరుగుతున్న తరుణంలో అక్కడ మరింతగా దృష్టి కేంద్రీకరించారు.

బీజేపీ కనుసన్నుల్లోనే ఈసీ పని చేస్తోంది - అందుకే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని నిషేధించారు : కేటీఆర్‌ - KTR Comments on Election Commission

బీఆర్ఎస్​కు 10 సీట్లు ఇస్తే- ఏడాదిలో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది : కేటీఆర్ - KTR meeting with party workers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.