ETV Bharat / entertainment

'పుష్ప 2' స్పెషల్ సాంగ్ హీరోయిన్ కన్ఫార్మ్- బన్నీతో స్టెప్పులేసేది ఎవరంటే? - Pushpa 2

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 7:40 AM IST

Updated : May 24, 2024, 8:00 AM IST

Pushpa 2 Item song: స్టార్ హీరో అల్లు అర్జున్ 'పుష్ప- 2' స్పెషల్ సాంగ్​లో ఎవరు కనిపించనున్నారన్న విషయం ఆసక్తిగా మారింది. అయితే మేకర్స్​ ఐటెమ్​ సాంగ్​లో స్పెప్పులేయనున్న హీరోయిన్​ను తాజాగా కన్ఫార్మ్ చేసినట్లు తెలిసింది.

Pushpa 2 Item song
Pushpa 2 Item song (Source: ETV Bharat)

Pushpa 2 Item song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్​ పుష్ప- 2లోనూ ఐటెమ్ సాంగ్ ఉండనుందని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. అయితే తొలి పార్ట్​ స్పెషల్ సాంగ్​లో స్పెప్పులేసిన సమంతనే సీక్వెల్​లోనూ ఆడిపాడనుందని టాక్ వినిపించింది. కానీ, సమంత ఈ సాంగ్ చేయట్లేదని క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత మేకర్స్​ బాలీవుడ్ బ్యాటీలు దీశా పటానీ, జాన్వీ కపూర్​ను సంప్రదించినట్లు టాక్ నడిచింది. వాళ్లు కూడా నో చెప్పారని సమాచారం. కానీ, ఈ విషయంపై ఓ కొలిక్కి రాలేదు. అయితే ఈ సస్పెన్స్​కు డైరెక్టర్ సుకుమార్ తాజాగా చెక్ పెట్టారంట. ఐటెమ్ సాంగ్​లో స్పెప్పులేయనున్న హీరోయిన్​ను కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే?

'పుష్ప ది రూల్​'లో ఐటెమ్ సాంగ్​లో ఎవరు కనిపించనున్నరన్న సస్పెన్స్ వీడినట్లే! ఈ పాటకోసం మూవీ మేకర్స్ బాలీవుడ్ బ్యాటీ 'యానిమల్' ఫేమ్ త్రిప్తి దిమ్రిని సంప్రదించారట. ఆమె నుంచి కూడా పాటిజివ్ రెస్పాన్స్​ వచ్చినట్లు సమాచారం. దీంతో స్పెషల్ సాంగ్​లో బన్నితో కలిసి, త్రిప్తి చిందులేయడం దాదాపు ఖాయమైనట్లే! ఇక జూన్​లో ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలిసింది. కానీ, ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

అంతటి క్రేజ్ వచ్చేనా? పుష్ప తొలి పార్ట్​లో స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా ఉఉ అంటావా'కు ఊహించని రేంజ్​లో రెస్పాన్స్​ వచ్చింది. ఈ పాట సినిమా సక్సెస్​లో భాగమైంది. సమంత డ్యాన్స్ పాటలో మరో హైలైట్. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్​లో సాగిన ఈ పాటకు ఇప్పటికే 400 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. దీంతో సీక్వెల్​లోనూ ఐటెమ్​ సాంగ్​పై డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఇప్పటికే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజైన టీజర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్​ కూడా ట్రెండింగ్​లో దూసుకెళ్తోంది. ఇక తాజాగా రెండో పాట అప్డేట్ కూడా వచ్చింది. 'కపుల్ సాంగ్' పేరుతో రెండోపాట మే 29న రిలీజ్ కానుంది. కాగా సినిమాకు రాక్​స్టాడ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, రష్మిక మంధన్నా హీరోయిన్​గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సీనియర్ నటుడు సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్​వైడ్​గా 2024 ఆగస్టు 15న గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

పుష్ప కపుల్ సాంగ్- ఇట్స్ శ్రీవల్లి టైమ్- వీడియో చూశారా? - Pushpa 2 Songs

సుకుమార్ నెక్స్ట్ ఛాయిస్​ ఎవరు? - బిగ్ కన్ఫ్యూజన్​! - Pushpa 2 Special Song

Last Updated : May 24, 2024, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.