ETV Bharat / politics

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్​కు బిగ్‌ షాక్ - ఆ నేతలంతా 'కారు' దిగి 'కమలం'లోకి!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 11:18 AM IST

BRS
BRS

Big Shock in BRS Joint Mahabubnagar District : ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్​కు పెద్ద షాక్‌ తగలనుంది. గత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఆశించి భంగపడ్డ గులాబీ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ రాములు, ఇప్పుడు ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కుమారుడు భరత్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వనపర్తి జడ్పీ ఛైర్మన్​ లోక్‌నాథ్ ​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి అనుచరుడు, నాగర్​కర్నూల్‌ డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్​ రెడ్డిలు సైతం బీఆర్ఎస్​ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడు దిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో వారు కాషాయ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్​కు బిగ్‌ షాక్

Big Shock in BRS Joint Mahabubnagar District : ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్​ఎస్​కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ సిట్టింగ్‌ నాగర్‌కర్నూల్‌ ఎంపీ, పోతుగంటి రాములు బీజేపీలో చేరబోతున్నారు. కొంత కాలంగా పార్టీ అగ్రనేతలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. భారత్ రాష్ట్ర సమితిలో ఎదురైన పరిణామాలు అవమానపర్చేలా ఉన్నాయని రాములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగే పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

MP Ramulu Resigned From BRS : గత అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట టికెట్​ను రాములు ఆశించారు. కల్వకుర్తి జడ్పీటీసీగా ఉన్న ఆయన కుమారుడు భరత్‌కి రెండుసార్లు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉన్నా అగ్రనేతలు అడ్డుపడినట్టుగా భావిస్తున్నారు. ఇప్పుడు బీఆర్​ఎస్​ నుంచి పోటీచేస్తే ఓటమి తప్పదని భావించిన రాములు (MP Ramulu) బీజేపీ వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కుమారుడు భరత్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు

మరోవైపు వనపర్తి జడ్పీ ఛైర్మన్‌ లోక్‌నాథ్ ​రెడ్డి బీఆర్ఎస్​ను వీడి (Resigned BRS) బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో కమలం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నా, చివరి నిమిషంలో విరమించుకొని గులాబీ పార్టీలోనే కొనసాగారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం. అదే విధంగా నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌ రెడ్డి సైతం పార్టీ నుంచి బయటకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

మర్రి జనార్దన్‌రెడ్డి కుడి భుజంగా ఉన్న రఘునందన్​ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత తగ్గించడంతో బీఆర్ఎస్ ఓడిపోయింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏదో ఒక నియోజకవర్గానికి బాధ్యత వహించేలా ఆయన బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న రఘునందన్ ​రెడ్డి, 2014లో మర్రి జనార్దన్​రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. అప్పటి నుంచి రఘునందన్ ​రెడ్డి మర్రి జనార్దన్​రెడ్డికి అండగా నిలిచారు.

బీఆర్ఎస్​కు బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ వెంకటేశ్‌ నేత

NagarKurnool MP Ramulu to Join BJP : వాళ్లంతా నేడు దిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కమలం పార్టీ అధిష్ఠానం సైతం గరిష్ఠ స్థానాలు గట్టి పోటీనిచ్చే అభ్యర్థులపై గురి పెట్టింది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై దృష్టి సారించింది. మరికొందరు ప్రజాప్రతినిధులతోనూ చర్చలు జరుపుతున్నారు. ఇవాళ దిల్లీ వెళ్తున్న రాష్ట్ర నేతలు కిషన్​రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో మెజార్టీ లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

మెదక్ లోక్‌సభ అభ్యర్థ్విత్వం కోసం బీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ - అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు

కాంగ్రెస్​లోకి కొనసాగుతున్న వలసలు - బీఆర్ఎస్​కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.