ETV Bharat / health

పెయిన్​ కిల్లర్స్ ఎక్కువగా వాడుతున్నారా? అల్సర్స్​ రావడానికి అదే కారణమవ్వచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 2:21 PM IST

Stomach Ulcers Symptoms : చాలామంది భోజనం సరిగ్గా తినకపోయినా, భోజనంలో మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉన్నా అజీర్తితో బాధపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది అల్సర్స్‎తో బాధపడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అసలు అల్సర్స్ అంటే ఏమిటి? అసలు ఇవి ఎందుకు వస్తాయి? దీనికి పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Stomach Ulcers Symptoms
Stomach Ulcers Symptoms

Stomach Ulcers Symptoms : అజీర్తి అనేది ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. సమయానికి ఆహారం తీసుకోకపోతే, తీసుకున్న ఆహారంలో నూనెలు, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే అజీర్తి అనేది తీవ్రరూపం దాల్చినప్పుడు అల్సర్స్​గా మారుతుంది. ఈ మధ్య కాలంలో అల్సర్స్​గా బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అల్సర్స్​ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? వాటికి సంబంధించిన నివారణ చర్యలను ఇప్పుడు చూద్దాం.

అల్సర్స్​ అంటే?
What Are Stomach Ulcers : జీర్ణకోశంలోని పేగులో పూత లేదా పొట్టులా ఏర్పడడాన్ని అల్సర్స్​ అని, వైద్యపరిభాషలో గ్యాస్ట్రైటిస్​ అని అంటారు. ఇది ప్రారంభంలో పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా, పెరిగి తీవ్రమైనప్పుడు మాత్రం ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు. అల్సర్స్​ వల్ల కొన్నిసార్లు తీవ్రంగా రక్తస్రావం జరిగి, శరీరానికి నష్టం కలగవచ్చు. అలాంటప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

అల్సర్స్‎కు కారణాలు ఇవే
అల్సర్స్​ రావడానికి కారణాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది జీవన విధానంలో మార్పు రావడం. అలాగే హెచ్​ పైలోరి అనే బ్యాక్టీరియా కూడా ఇందుకు ప్రధాన కారణం. ఈ బ్యాక్టీరియా చేసే ఇన్‎ఫెక్షన్​ వల్ల కూడా అల్సర్స్ ఏర్పడతాయి. ఈ బ్యాక్టీరియా యాంట్రమ్​ అనే పేగు భాగాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు కలుషిత నీటి వల్ల కూడా అల్సర్స్​ ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే పెయిన్​ కిల్లర్స్​ వాడే వారికీ అల్సర్స్​ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది.

అల్సర్స్​ నిర్ధరణ ఇలా
కొన్నిసార్లు అల్సర్స్​ బయటపడకపోవచ్చు. అనుమానం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా అల్సర్స్​ ఉన్నాయా లేదా అనేది నిర్ధరణ అవుతుంది. వైద్యులు ముందుగా పేషంట్​ హిస్టరీని చెక్​ చేస్తారు. పెయిన్​ కిల్లర్స్​ లాంటివి ఏమైనా వాడుతున్నారా, లేదా అనేది తెలుసుకుంటారు. ఇతర ఆరోగ్యపరమైన అంశాల గురించి కూడా ఆరా తీస్తారు. కొన్నిసార్లు వైద్యులు ఎండోస్కోపీ చేయడం ద్వారా అల్సర్స్​ ఎంత పరిమాణంలో ఉన్నాయో కూడా చెక్​ చేసుకోవచ్చు.

అల్సర్స్​కు చికిత్స
అల్సర్స్​ వచ్చినప్పుడు వైద్యులు ముందుగా పేషంట్​ జీవన విధానంలో మార్పులను సూచిస్తారు. ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. అలాగే వ్యాయామం చేయాలని, సమయానికి భోజనం తినాలని చెబుతారు. సాధారణంగా మందులను వాడటం ద్వారా అల్సర్స్​ తగ్గిపోతాయని, ఒకవేళ మందులకు తగ్గని వాటి కోసం సర్జరీ చెయ్యాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

అల్సర్స్​ రాకుండా ఇలా చేయండి
బయటకు వెళ్లినప్పుడు కలుషిత ఆహారానికి దూరంగా ఉండండి. అలాగే ఆహారంలో ఎక్కువ మోతాదులో నూనెలు, కొవ్వులు లేకుండా చూసుకోండి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటమే కాకుండా క్రమం తప్పకుండా శారీరక వ్యాయమాలు చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్యగమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.

ఈ మూడిట్లో మీ శరీరంలో ఏ దోషం ఉంది? - ఇది తెలియకనే సకల రోగాలు!

బరువు తగ్గడం నుంచి షుగర్ కంట్రోల్ దాకా - మెంతులతో సూపర్​ బెనిఫిట్స్ ఎన్నో​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.