ETV Bharat / health

మీ డైట్‌లో ఈ రసాలుంటే - ఈజీగా బరువు తగ్గొచ్చు! - Rasam Recipe For Weight Loss

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 12:27 PM IST

Rasam Recipe For Weight Loss
Rasam Recipe For Weight Loss

Rasam Recipe For Weight Loss : మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా ? ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్‌ లాస్‌ అవ్వడం లేదా ? అయితే, మీ డైట్​లో ఈ రసాలను చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rasam Recipe For Weight Loss : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉండటానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండటం, జన్యువులు వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులంటున్నారు. ఎక్కువ బరువున్న వారు వెయిట్‌లాస్‌ అవ్వడానికి రోజూ వివిధ రకాల వ్యాయామాలు చేస్తూనే కొన్ని ఆరోగ్యకరమైన రసాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ఇంతకీ బరువును తగ్గించే రసాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టమాట రసం : అధిక బరువుతో బాధపడే వారు రోజూ వివిధ రకాల వ్యాయామాలు చేస్తూనే.. క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే టమాట రసాన్ని తీసుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల హెల్దీగా వెయిట్‌లాస్‌ అవ్వచ్చని చెబుతున్నారు. 2010లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్" జర్నల్‌ ప్రచురితమైన నివేదిక ప్రకారం, రోజూ టమాట రసం తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ న్యూట్రిషన్ సెంటర్ డైరెక్టర్ డా. జాన్స్ హాబర్‌కార్న్ పాల్గొన్నారు. డైలీ టమాటా రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

మిరియాల రసం : బరువు తగ్గాలనుకునే వారికి మిరియాల రసం బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని మెటబాలిజాన్ని (జీవరసాయన ప్రక్రియలు) పెంచి ఎక్కువ కొవ్వు కరిగేటట్టు చేస్తాయని నిపుణులంటున్నారు. కాబట్టి, వీరు డైలీ ఆహారంలో మిరియాల రసం ఉండేట్టుగా చూసుకోవాలని చెబుతున్నారు.

జీలకర్ర, కొత్తిమీర రసం : వెయిట్‌లాస్‌ అవ్వాలనుకునే వారు ఆహారంలో జీలకర్ర, కొత్తిమీర రసం ఎక్కువగా తీసుకోవాలి. ఈ రసంలోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, బరువు తగ్గేలా చేస్తాయని నిపుణులంటున్నారు.

పుదీనా రసం : అధిక బరువుతో బాధపడేవారు పుదీనా రసం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. ఇంకా ఇందులోని పోషకాలు శరీరాన్ని చల్లబరచడంతో పాటు రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తాయని నిపుణులంటున్నారు. అలాగే బరువు తగ్గేలా చేస్తుందని చెబుతున్నారు.

ఆఫ్ట్రాల్ అరటి 'తొక్కే' కదా అని చెత్తబుట్టలో వేస్తున్నారా? - అయితే ఈ ప్రయోజనాలు మిస్​ అయినట్లే! - Banana Peel Health Benefits

మిరియాలు, నిమ్మకాయతో చేసిన రసం : నిమ్మకాయలో ఉండే కొన్ని పోషకాలు శరీరంలో కొవ్వును కరిగించేలా చేస్తాయి. అయితే, బరువు తగ్గాలనుకునే వారు నిమ్మకాయ రసంలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

అల్లం రసం : అల్లంలో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుందని నిపుణులంటున్నారు. కాబట్టి, ఎక్కువ బరువున్న వారు అల్లం రసం తీసుకోవాలని సూచిస్తున్నారు.

పాలకూర రసం : బరువు తగ్గాలనుకునే వారు డైట్‌లో పాలకూర రసం తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పాలకూరలో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. ఇంకా ఇందులో ఉండే ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్‌ బరువు తగ్గేలా చేస్తాయని నిపుణులంటున్నారు. కాబట్టి, వెయిట్‌లాస్‌ అవ్వాలనుకునే వారు పాలకూర రసం తీసుకోండి.

మునక్కాయ రసం : మునగకాయలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే, బరువు తగ్గాలనుకునే వారి ఆహారంలో మునక్కాయ రసం తీసుకోవడం వల్ల కూడా వెయిట్‌లాస్‌ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ ఫుడ్స్ తింటున్నారా? - అయితే మీకు బీపీ గ్యారెంటీ! - Worst Foods For Blood Pressure

డైలీ పసుపుతో ఇలా చేశారంటే - మెరిసే అందం మీ సొంతం! - Haldi Water Beauty Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.