ETV Bharat / entertainment

హనుమాన్ మీ ఇంటికి వచ్చేస్తున్నాడు - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 5:56 PM IST

Updated : Feb 17, 2024, 6:06 PM IST

మీ ఇంటికి హనుమాన్ వచ్చేస్తున్నాడు - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​!
మీ ఇంటికి హనుమాన్ వచ్చేస్తున్నాడు - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​!

Prasanth Varma Hanuman OTT : ఈ సంక్రాంతికి థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేసిన హనుమాన్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్​కు రెడీ అయినట్లు తెలిసింది. ఆ వివరాలు

Prasanth Varma Hanuman OTT : ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఈ సంక్రాంతి బరిలో దిగి అంచ‌నాల‌ను తారుమారు చేసిన చిత్రం హనుమాన్. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో థియేటర్లలో చూసిన వారితో పాటు మిగతా వారు కూడా ఎప్పుడెప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందా? రెండో సారి ఎప్పుడు చూద్దామా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడా వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్​కు సిద్ధమైందని తెలిసింది.

వివరాల్లోకి వెళితే. ప్ర‌శాంత్ వ‌ర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ స‌జ్జ హీరోగా 'హ‌నుమాన్' రూపొందింది. దాదాపు రూ.30కోట్లలోపే బడ్జెట్​తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్ల‌ వరకు సంచలన వసూళ్లు చేసింది. చిన్న పెద్దా తేడా అని లేకుండా ప్రతిఒక్కరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమా కోసం క్యూ కట్టారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని ఎంతో నేచురల్​గా బాగా తెరకెక్కించారు. మ్యూజిక్​ కూడా అద్భుతంగా అందించారు. ఇక క్లైమాక్స్​లో చివరి పది నిమిషాలు అయితే ప్రతిఒక్కరికీ గూస్​ బంప్స్​ వచ్చేలా సన్నివేశాల్ని తీశారు. దీంతో ప్రతిఒక్కరూ ఈ చిత్రానికి ఫిదా అయిపోయారు.

ఉత్తరాద్రి రాష్ట్రంలోనూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. పలు రికార్డులను క్రియేట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభాస్, యశ్​, రజనీకాంత్​, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రిషబ్ శెట్టి తర్వాత నార్త్​లో రూ.50 కోట్ల నెట్ కలెక్షన్స్​ వసూలు చేసిన హీరోగా సజ్జా నిలవడం విశేషం. అయితే ఈ సినిమాను థియేట‌ర్లలో ఎక్స్ పీరియెన్స్ చేసిన వాళ్లు మరోసారి ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి కోసం హ‌నుమాన్ స్ట్రీమింగ్​కు రెడీ అయిపోయిందని తెలిసింది. మార్చి 2 నుంచి ఓటీటీలోకి రాబోతున్నట్లు ఓటీటీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే, దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్​ను జీ - 5 ఫ్లాట్ ఫామ్ ద‌క్కించుకుంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్​ కోసం ఎదురుచూసేవాళ్లు ఎంచక్కా మీ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ 3 సవాళ్లను బ్రేక్ చేస్తేనే 'దేవర' సక్సెస్​ - తారక్ ఏం చేస్తారో?

NBK 109 వర్సెస్​ దేవర : బాబాయ్ -​ అబ్బాయ్​ బాక్సాఫీస్ ఫైట్​!

Last Updated :Feb 17, 2024, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.