ETV Bharat / entertainment

NBK 109 వర్సెస్​ దేవర : బాబాయ్ -​ అబ్బాయ్​ బాక్సాఫీస్ ఫైట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 3:37 PM IST

NTR VS Balakrishna : దేవర రిలీజ్ డేట్ క్లారిటీతో బాక్సాఫీస్ ముందు సరికొత్త పోరుకు తెరలేచే అవకాశం కనిపిస్తుంది. బాబాయ్ బాలయ్య వర్సెస్​ అబ్బాయి తారక్​ వార్​ నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు.

NBK 109 వర్సెస్​ దేవర : బాబాయ్ -​ అబ్బాయ్​ బాక్సాఫీస్ ఫైట్​!
NBK 109 వర్సెస్​ దేవర : బాబాయ్ -​ అబ్బాయ్​ బాక్సాఫీస్ ఫైట్​!

NTR VS Balakrishna : అంతా అనుకున్నట్లే జరిగింది. కాకపోతే కాస్త ఆలస్యంగా చెప్పారు దర్శకుడు కొరటాల శివ. ముందుగా నుంచి అనుకున్నట్టే దేవర వాయిదా పడింది. వేసవిని వదిలేసి మరో సాలిడ్ సీజన్‌ దసరాపై కన్నేశారు. అక్టోబర్ 10న సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. అయితే ఈ విడుదల తేదీతో బాక్సాఫీస్​ ముందు ఓ ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. మరోవైపు అబ్బాయితో పోటీకి బాబాయ్ బాలయ్య రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దేవర వెన్నంటే బాలయ్య వస్తారా? లేదా అనేది ప్రస్తుతం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో ఆసక్తిగా మారింది.

వివరాల్లోకి వెళితే. తారక్​ - బాలయ్య కలిసి నటిస్తే చూడాలని వేలాది మంది అభిమానుల కోరిక. కనీసం ఈ ఇద్దరు ఒక వేదికపై కలిసి కనిపించినా చాలు కడుపు నింపుకుంటారు ఫ్యాన్స్. కానీ అది మాత్రం జరగట్లేదు. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు పోటీ పడే అవకాశముందని బయట టాక్ గట్టిగా వినిపిస్తోంది. అవును. మీరు చదివింది నిజమే. తాజాగా దేవర సినిమా వాయిదాపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఎప్రిల్ 5 నుంచి ఏకంగా 6 నెలలు వాయిదా పడి దసరాకు వెళ్లిపోయింది.

NBK 109 వర్సెస్​ దేవర : అయితే బాలకృష్ణ బాబీ ఎన్​బీకే 109 సినిమా కూడా దసరాకే టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇప్పటికే గతేడాది దసరా బరిలో దిగి భగవంత్ కేసరితో భారీ హిట్ అందుకున్నారు బాలయ్య. అదే సెంటిమెంట్ మళ్లీ అప్లై చేయాలని బాలయ్య బాబీ అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే కనుక జరిగితే బాబాయ్ వర్సెస్​ అబ్బాయ్ వార్ తప్పదు! గతంలో 2016 సంక్రాంతికి నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ చిత్రాలు ఒకట్రెండు రోజుల గ్యాప్‌లో వచ్చాయి. అప్పుడు నాన్నకు ప్రేమతో భారీ హిట్​ను అందుకుంది. డిక్టేటర్ పర్వాలేదనిపించింది. మరి ఈ సారి దసరాకు సేమ్ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఒకే టైమ్​లో వస్తే ఎవరు బాక్సాఫీస్​పై పైచేయి సాధిస్తారో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాక్సాఫీస్ కింగే అయినా​ - భార్య కోసం గల్లీలోని కిరాణా కొట్టుకు!

సందీప్ కెరీర్​లో హయ్యెస్ట్​ గ్రాసర్ - 'భైరవకోన' తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.