ETV Bharat / entertainment

OTTని షేక్ చేస్తున్న టాప్ ట్రెండింగ్ మూవీస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 7:54 PM IST

Salaar Animal Movie Top Trending : రీసెంట్​గా బ్లాక్ బాస్టర్ మూవీస్​ సలార్​, యానిమల్​ ఇప్పుడు ఓటీటీలోనూ భారీ రేంజ్ రెస్పాన్స్​ను అందుకుంటున్నాయి. వరల్డ్ వైడ్​గా టాప్ ట్రెండింగ్​లో దూసుకెళ్తున్నాయి. ఆ వివరాలు.

OTTని షేక్ చేస్తున్న టాప్ ట్రెండింగ్ మూవీ ఇవే
OTTని షేక్ చేస్తున్న టాప్ ట్రెండింగ్ మూవీ ఇవే

Prabhas Salaar Ranbir Animal Movie Top Trending : ప్రస్తుతం ఓటీటీలో రెండు సూపర్​ హిట్​ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతూ రికార్డ్​ వ్యూస్​తో దూసుకెళ్తున్నాయి. కోట్ల కొద్ది వ్యూస్​ను దక్కించుకుంటూ ఓటీటీ ప్రియులను మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి.​ అవే భారీ యాక్షన్ డ్రాప్​ 'సలార్'​, 'యానిమల్'​. ఇప్పటికే థియేటర్లలో చూసిన వారు కూడా మరోసారి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్క్రీన్స్​లో మిస్ అయిన వారు కూడా చూసేందుకు రెడీ అయిపోతున్నారు. ఎలాగో వీకెండ్ వచ్చేసింది కాబట్టి మీరు కూడా ఈ చిత్రాలను చూసి ఎంచక్కా ఆస్వాదించండి..

వరల్డ్ వైడ్​గా టాప్​ ట్రెండింగ్​ : ఖాన్సార్‌ సామ్రాజ్యం బ్యాక్​డ్రాప్​లో రెబల్ స్టార్​ ప్రభాస్‌ హీరోగా రూపొందించిన చిత్రమిది. 700 కోట్లకు పైగా కలెక్షన్స్​ను అందుకున్న ఈ బ్లాక్ బస్టర్​ హిట్‌ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే రేంజ్​లో రెస్పాన్స్​ను అందుకుంటోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్​గా అత్యధిక వీక్షణలతో టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకువెళ్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసిన వారంతా ప్రశాంత్ నీల్​ డైరెక్షన్, ప్రభాస్​ యాక్షన్, కటౌట్​ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఫారిన్ ఆడియెన్స్​ ఫిదా అయిపోతున్నారు. సోషల్​ మీడియాలో సలార్ హ్యాష్ ట్యాగ్​ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలో 'సలార్' క్రేజ్ పీక్స్- ఫారినర్స్ రెస్పాన్స్ అదుర్స్

సలార్​తో పాటుగా : యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో ఫాదర్ అండ్ సన్​ ఎమోషనల్​ డ్రామాగా రిలీజై ​ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం యానిమల్​. జనవరి 26న అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రం కూడా వచ్చీ రాగానే సలార్​తో పాటుగా ఓటీటీని షేక్ చేయడం మొదలుపెట్టేసింది. ఊహించని రేంజ్​లో బ్లాక్ బస్టర్​ రేంజ్​ రెస్పాన్స్‌ అందుకుంటూ టాప్ ట్రెండింగ్​లో దూసుకెళ్తోంది. కాగా, ఈ చిత్రంలో హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో పాటు అనిల్ కపూర్​, బాబీ దేఓల్​ కీలక పాత్రల్లో నటించారు. సందీప్ రెడ్డి వంగా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700కోట్లకు పైగా సంచలన వసూళ్లను అందుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నాన్న, నాన్న - 'యానిమల్'లో ఈ పదం ఎన్ని వందల సార్లు వాడారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.