YUVA : ఆసియాలోనే మొట్ట మొదటి మహిళ సేఫ్టీ ఆఫీసర్‌ మన హైదరాబాదీనే - First Woman Safety Officer Sathvika

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 3:43 PM IST

Updated : May 25, 2024, 3:49 PM IST

thumbnail
YUVA : ఆసియాలోనే మొట్ట మొదటి మహిళ సేఫ్టీ ఆఫీసర్‌ మన హైదరాబాదీనే (ETV Bharat)

First Woman Safety Professional Sathvika Gupta Interview : అగ్ని ప్రమాదాలు జరిగినపుడు మరింత ఆస్థి నష్టం జరగకుండా చూడటం ఎంత ముఖ్యమో బాధితుల ప్రాణాలు రక్షించడం ఇంకా ముఖ్యం. ఎక్కడో చిక్కుకుపోయినవారిని  కనిపెట్టి తీసుకురావడం అంత ఆషామాషీ కాదు. సవాళ్లతో కూడిన ఈ రంగంలో మహిళల సంఖ్య చాలా తక్కువ. ఈ విభాగంలో  సేఫ్టీ ఆఫీసర్‌గా రాణిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన సాత్వికా గుప్తా. ఆసియాలోనే తొలి మహిళా సేఫ్టీ ప్రొఫెషనల్‌గా ఆమె గుర్తింపు పొందారు. విదేశాలలో విద్యనభ్యసించిన సాత్విక్‌ గుప్తా, తన తండ్రి ప్రేరణతో సేఫ్టీ ఫీల్డ్‌లోకి వచ్చానని చెబుతున్నారు.

Sathvika Gupta Exclusive Interview : తన తండ్రిసైతం సేఫ్టీ విభాగంలోనే ఉద్యోగం చేస్తుండటం, తనను అటువైపు వెళ్లేలా దోహదం చేసిందంటున్నారు. అదేవిధంగా పలు రంగాల్లో జరిగే ప్రమాదాలపై ఒక ఆఫీసర్‌గా అవగాహన కల్పిస్తూనే, ప్రతి సంస్థలో సేఫ్టీ ఆఫీసర్‌ ఉండాలని సూచన చేస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత చింతించడం కంటే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సాత్వికను అడిగి, ఈ రంగంలో ఉండే సమస్యలు, ఆమె అనుభవాలు తెలుసుకుందాం.

Last Updated : May 25, 2024, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.