ETV Bharat / entertainment

OTTలో 'సలార్' క్రేజ్ పీక్స్- ఫారినర్స్ రెస్పాన్స్ అదుర్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 7:04 AM IST

Updated : Jan 27, 2024, 8:29 AM IST

Salaar Globalwide OTT Response: ప్రభాస్- ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్- 1 ఓటీటీలో బ్లాక్​బస్టర్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇప్పటికే సౌత్ ఇండియన్ భాషల్లో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా తాజాగా గ్లోబల్ ఆడియెన్స్​కు కూడా రీచ్ అయ్యింది.

Salaar Globalwide OTT Response
Salaar Globalwide OTT Response

Salaar Globalwide OTT Response: రెబల్​స్టార్ ప్రభాస్ రీసెంట్ యాక్షన్ ఎంటర్​టైన్​మెంట్ 'సలార్ పార్ట్​- 1' ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. జనవరి 20న ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు గ్లోబల్​​ ఆడియెన్స్ (వరల్డ్​వైడ్​)​కు బాగా కనెక్ట్ అవుతోంది. థియేటర్లలో ఎంత సక్సెస్ సాధించిందో ఓటీటీలో సలార్ అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకుంటుంది.

ప్రస్తుతం ఇండియన్ సౌత్ లాంగ్వేజెస్​లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫారిన్ ఆడియెన్స్ నుంచి ఊహించని రేంజ్​లో క్రేజ్ దక్కుతోంది. ఫారినర్స్ ట్వీట్స్​తో సోషల్ మీడియాలో మరోసారి సలార్ మేనియా క్రియేటైంది.​​ సలార్ చూసిన ఫారిన్ ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్​ (ట్విట్టర్​)లో ప్రసంశలు కురిపిస్తున్నారు. అయితే ఇండియన్ భాషల్లోనే ఇలా ఉంటే, ఇక ఇంగ్లీష్​ వెర్షన్ అందుబాటులోకి వచ్చాక వరల్డ్​వైడ్​గా రెస్పాన్స్ పీక్స్​లో ఉండే ఛాన్స్ ఉంది.

గతేడాది డిసెంబర్​ 22న థియేటర్లలో తెలుగు, హిందీ సహా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 'సలార్​' గ్రాండ్​గా రిలీజైంది. మరోవైపు ఓటీటీలో టాప్​- 10 సలార్​ స్ట్రీమ్​ అవుతున్నట్లు నెట్​ఫ్లిక్స్​ తెలిపింది. ఇక ఈ సినిమా ఇంగ్లీష్​ వెర్షన్​ కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు నెట్​ఫ్లిక్స్​ ప్లాన్ చేస్తోంది.

Salaar Cast: డైరెక్టర్ ప్రశాంత్ నీల్​ ఫుల్​ లెంగ్త్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్, జగపతిబాబు, ఝాన్సీ, శ్రేయా రెడ్డి, సప్తగిరి, శ్రుతిహాసన్, ఈశ్వరీ రావు తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. రవి బస్రూర్​ మ్యుజిక్​ కంపోజ్​ చేశారు. హోంబలే ఫిల్మ్స్​ బ్యానర్​పై విజయ్​ కిరాగందుర్​​ నిర్మించారు.

Salaar Part- 2 Update: సలార్ సీజ్​ఫైర్ బ్లాక్​బస్టర్ హిట్​ కావడం వల్ల ఫ్యాన్స్ అంతా రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా సెకెండ్ పార్ట్ షూటింగ్​కు ఏర్పాట్లు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసి 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ మూవీ తర్వాత సందీప్​రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్​కు రెడీ అయ్యేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్​తో కలిసి కల్కి 2898 AD సినిమా చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఆ అనుభూతిని బాలీవుడ్‌లో ఎప్పుడూ పొందలేదు'

'సలార్' ప్రభాస్ డైలాగ్స్​ వీడియో - షాక్​ అవుతున్న ఆడియెన్స్​!

Last Updated : Jan 27, 2024, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.