ETV Bharat / entertainment

నాన్న, నాన్న - 'యానిమల్'లో ఈ పదం ఎన్ని వందల సార్లు వాడారో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 6:35 PM IST

Etv Bharat
Etv Bharat

Animal Movie Papa word : పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో ఫాదర్ అండ్ సన్​ ఎమోషన్​ డ్రామాగా వచ్చిన 'యానిమల్' సినిమాలో నాన్న అనే పదం ఎక్కువ సార్లు వినపడుతూ ఉంటుంది. అయితే ఈ చిత్రంలో ఆ పదాన్ని ఏకంగా ఎన్ని వందల సార్లు ఉపయోగించారో ఓ వీడియోను కట్​ చేసి పోస్ట్ చేశారు అభిమానులు. ప్రస్తుతం అది సోషల్​ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతోంది.

Animal Movie Papa word : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్​ ఫిల్మ్​ 'యానిమల్​'. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేమ్​ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను గ్రాండ్​గా తెరకెక్కించారు. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో ఫాదర్ అండ్ సన్​ ఎమోషన్​ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో సక్సెస్​ఫుల్​గా స్ట్రీమింగ్​ అవుతోంది.

Animal Movie OTT : సాధారణంగా ఓ సినిమా ఓటీటీలో వచ్చిందంటే థియేటర్లలో గుర్తించని ప్లస్ అండ్ మైనస్​లు, ఇంట్రెస్టింగ్ పాయింట్స్​ను ఈ డిజిటల్​ ప్లాట్​ఫామ్​లో గుర్తించి సోషల్​ మీడియాలో షేర్ చేస్తుంటారు మూవీ లవర్స్​. ఇక అందులో కొన్ని ట్రోల్స్​కు గురైతే మరికొన్ని ట్రెండ్ అవుతుంటాయి. అలా ఇప్పుడు యానిమల్​ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫాదర్​ ఎమోషన్​తో వచ్చిన ఈ సినిమాలో 'నాన్న' అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇప్పుడా నాన్న అనే పదం మొత్తం ఎన్ని సార్లు ఉపయోగించారో తెలిసింది. మొత్తం 196 సార్లు వాడినట్లు ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. సినిమా మొత్తంలో ఎన్నిసార్లు నాన్న పదం వాడారు? ఏ సందర్భంలో వాడారు? వంటివి సీన్స్​తో 1:26 నిమిషాల నిడివితో వీడియో ఉంది. హిందీ వర్షన్​కు సంబంధించి ఈ వీడియోను కట్ చేశారు. ఇక తెలుగు డబ్బింగ్​లోనూ కూడా దాదాపు అన్ని సార్లే వాడి ఉండొచ్చని అంటున్నారు.

కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అనిల్ కపూర్, బాబీ దేఓల్​, పృథ్వీరాజ్ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అనిల్ కపూర్​ తండ్రి పాత్రలో, బాబీ దేఓల్​ విలన్ పాత్రలో నటించారు. బాబీ దేఓల్ పాత్రకు మాత్రం విశేష ఆదరణ దక్కింది. ఆయన సెకండ్ ఇన్నింగ్స్​కు ప్లస్​గా నిలిచింది. ఇక రష్మిక మందాన్న హీరోయిన్​గా నటించింది.

'అది చూసి వాంతు వచ్చినట్టైంది' - ఆ స్టార్ హీరో మూవీపై రాధిక కామెంట్స్​!

OTTలోకి వచ్చేసిన రెండు సూపర్ హిట్​ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్​ - ఎక్కడ చూడాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.