ETV Bharat / entertainment

బంపర్ ఆఫర్ : ప్రభాస్ ఐకానిక్ బైక్ మీ సొంతమవ్వాలా? ఇలా చేస్తే చాలు! - salaar Bike

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 9:09 PM IST

.
.

Prabhas Salaar Bike : సూపర్‌ హిట్‌ మూవీ సలార్‌లో ప్రభాస్‌ నడిపిన బైక్‌ గుర్తుందా? ఇప్పుడు ఆ ఐకానిక్‌ బైక్‌ను గెలుచుకునే అవకాశాన్ని హోంబలే ఫిల్మ్స్‌ అందిస్తోంది. మీరు ఏం చేయాలంటే?

Prabhas Salaar Bike : ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబినేషన్‌లో రూపొందిన సలార్‌ మూవీ 2023 డిసెంబర్‌లో రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సీఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ హైఓల్టేజ్‌ మూవీలో ప్రభాస్‌ చాలా సీన్స్‌లో బైక్‌ నడుపుతూ కనిపిస్తారు. ఈ బైక్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌, బైక్‌ లవర్స్‌కు తెగ నచ్చేసింది. మీకూ ఆ బైక్‌ అంటే ఇష్టమా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. సలార్‌ మూవీ టీమ్‌ ఈ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశం అందిస్తోంది.

ఇప్పుడు ఫ్యాన్స్‌ కోసం మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో గివ్‌ అవే క్యాంపెయిన్‌ స్టార్ట్‌ చేశారు. ప్రభాస్ ఐకానిక్ మోటార్‌సైకిల్‌ను ఒక లక్కీ విన్నర్‌కు అందజేయనున్నారు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్, గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ప్రభాస్ బైక్ నడుపుతున్న పోస్టర్‌ను షేర్ చేసి, క్యాప్షన్‌లో గివ్‌ అవే డీటైల్స్‌ పేర్కొంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • సలార్‌ బైక్‌ గెలవాలంటే ఏం చేయాలి?

హోంబలే ఫిల్మ్స్ ఇన్‌స్టా పోస్టులో "SalaarCeaseFireలో రెబెల్ స్టార్ #ప్రభాస్ నడిపిన అదే ఐకానిక్ బైక్‌ను గెలుచుకోవడానికి మీకో ఎక్స్‌క్లూజివ్‌ ఆపర్చునిటీ. మీరు చేయాల్సిందల్లా, ఏప్రిల్‌ 21న 5:30 PM నుంచి 8 PM వరకు స్టార్‌ మా ఛానెల్‌లో సలార్‌ మూవీ ప్రసారమవుతుంది. మూవీటైమ్‌లో స్క్రీన్ ఎడమ వైపున బైక్ ఇమేజ్‌ ఎన్నిసార్లు కనిపించిందో లెక్కించాలి. SMS లైన్స్‌ ఓపెన్‌ అయినప్పుడు, SALAAR <space> <స్క్రీన్‌పై బైక్‌ కనిపించిన సంఖ్య> టైప్‌ చేసి 9222211199కి SMS పంపండి. 2024 ఏప్రిల్ 21న రాత్రి 8 గంటల నుంచి SMS లైన్ష్‌ ఓపెన్‌ అవుతాయి. T&C వర్తిస్తాయి" అని వివరించింది.

నివేదికల ప్రకారం, సలార్‌లో వినియోగించిన బైక్‌ను హైదరాబాద్‌లో ఉన్న పాపులర్‌ బైక్‌ కస్టమైజేషన్ వర్క్‌షాప్ ఎయిమర్ కస్టమ్స్ రూపొందించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 మోడల్ ఆధారంగా కస్టమ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను తయారు చేసింది. ఈ కస్టమ్ బైక్‌ను ఓల్డర్‌ జనరేషన్‌ థండర్‌బర్డ్ మోటార్‌సైకిల్‌లోని పార్ట్స్‌ ఉపయోగించి రూపొందించడం విశేషం.

  • త్వరలో రానున్న కల్కి
    ప్రస్తుతం ప్రభాస్‌ మారుతి డైరెక్షన్‌లో ది రాజాసాబ్, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ADలో నటిస్తున్నారు. యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్‌ కల్కిలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, దీపికా పదుకొణె వంటి స్టార్లు యాక్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్‌ కానున్న భారీ సినిమాల్లో కల్కి ఒకటి.

బాహుబలి 2, RRR, దంగల్​ కాదు​ - 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయిన సినిమా ఏంటో తెలుసా? - Most Tickets Sold Movie In India

'నా సినిమాలో మిమ్మల్ని తీసుకొని తప్పు చేశా' - Sandeep Vanga Fire

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.