ETV Bharat / entertainment

'నా సినిమాలో మిమ్మల్ని తీసుకొని తప్పు చేశా' - Sandeep Vanga Fire

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 5:46 PM IST

Updated : Apr 18, 2024, 7:24 PM IST

Sandeep Vanga on Kabir Singh Actor : ఆ నటుడుపై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందంటే?

/..
.

Sandeep Vanga on Kabir Singh Actor : అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ బాలీవుడ్​లో ఎంతటి బ్లాక్ బస్టర్ టాక్​ తెచ్చుకుందో తెలిసిన విషయమే. ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో సీనియర్‌ నటుడు అదిల్‌ హుస్సేన్‌పై ఈ చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకంటే? - అదిల్‌ హుస్సేన్‌ కబీర్‌సింగ్‌లో కాలేజీ డీన్‌ పాత్ర పోషించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఈ సినిమాలో నటించడం తన కెరీర్​లో చేసిన పెద్ద తప్పు అని, ఆ చిత్రంలో భాగం అయినందుకు బాధపడుతున్నానని అన్నారు. ఒక యుట్యూబ్ పాడ్ కాస్ట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.

దిల్లీలో కబీర్ సింగ్​ సినిమా చూడడానికి వెళ్లిన తాను 20 నిమిషాల తర్వాత ఆ చిత్రం చూడలేక బయటకు వచ్చేశానని, ఒక మనిషిగా అలాంటి సినిమా చేసినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు అదిల్. సందీప్ డైరెక్ట్ చేసిన యానిమల్ గురించి కూడా మాట్లాడుతూ ఆ మూవీ తాను చూసే ధైర్యం చేయలేదని, స్నేహితుల నుంచి రివ్యూలు విన్నప్పటికీ స్వయంగా చూసేవరకు కామెంట్ చేయలేనని అన్నారు.

"అందరికి తమకు నచ్చినట్టు సినిమా తీసే స్వేచ్ఛ ఉంది. ఒక దర్శకుడిగా సందీప్​కు తనకు నచ్చిన సినిమా తీసే హక్కు ఉంది కానీ ఆయన భావాలతో నేను ఏకీభవించలేను. కబీర్ సింగ్ లాంటి సినిమా మగ ఆహాన్ని పెంపొందించేలా ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు అలాంటి సినిమాలో నటించినందుకు సిగ్గుపడుతున్నాను. నా భార్యకు కూడా ఆ సినిమాను చూడమని చెప్పలేదు. ఎందుకంటే ఆవిడకి అలాంటి సినిమాను చూస్తే కచ్చితంగా కోపం వస్తుంది" అంటూ ముగించారు అదిల్ హుస్సేన్.

ఈ ఇంటర్వ్యూ తర్వాత కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్​లో అదిల్ హుస్సేన్ పై తీవ్రంగా స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అదిల్​కు 30 సినిమాలు ఇవ్వని గుర్తింపు ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిందని అన్నారు. అదిల్​ ఇకపై సిగ్గుపడకుండా ఉండేలా ఆ చిత్రంలో ఆయన ముఖాన్ని AI సాయంతో మారుస్తానని చెప్పారు. అలాగే తన చిత్రంలో అదిల్​ను తీసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

/..
.

దళపతి ఫ్యాన్స్​ దెబ్బకు అకౌంట్ క్లోజ్ చేసిన సంగీత దర్శకుడు! - Thalapathy Vijay Whistle Podu Song

'రాజాసాబ్' సెట్స్​లోకి ప్రభాస్ ఎంట్రీ - న్యూ లుక్​లో ఎలా ఉన్నారంటే ? - Prabhas New Look

Last Updated :Apr 18, 2024, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.