ETV Bharat / entertainment

'రాజాసాబ్' సెట్స్​లోకి ప్రభాస్ ఎంట్రీ - న్యూ లుక్​లో ఎలా ఉన్నారంటే ? - Prabhas New Look

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 3:59 PM IST

Prabhas New Look
Prabhas New Look

Prabhas New Look : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా 'రాజా సాబ్' సెట్స్​లోకి అడుగుపెట్టారు. అయితే ఆయన న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇంతకీ ప్రభాస్ ఎలా ఉన్నారంటే ?

Prabhas New Look : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. శస్త్రచికిత్స కారణంగా ఇంతకాలం షూటింగులకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ ఫామ్​లోకి వచ్చి వరుస చిత్రీకరణలో​ పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'రాజా సాబ్' సెట్స్​లోకి అడుగుపెట్టారు.

ఇక ప్రభాస్​ను చూసిన కొంత మంది ఫ్యాన్స్​ ఆయన్ను వీడియో తీసి దాన్ని నెట్టింట షేర్ చేశారు. అందులో అందులో ఆయన గడ్డం, జుట్టుతో పాటు తన డ్రెస్సింగ్​ స్టైల్​ను కూడా మార్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. వింటేజ్ ప్రభాస్ తిరిగొచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాను త్వరగా రిలీజ్ చేస్తే బాగున్ను అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లా కనిపించనున్నట్లు మూవీ పోస్టర్​ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్​లో జరుగుతోంది. ప్రభాస్​తో పాటు ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రభాస్​, నిధి అగర్వాల్ పై ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే హీరో తేజ సజ్జా కూడా ఈ విషయంపై హింట్ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్​లో "నాకెందుకో రాజాసాబ్ నుంచి త్వరలో ఓ సాంగ్ రాబోతుందని డౌట్ గా ఉంది" అని అన్నారు. దీంతో ఆ వార్తలు నిజమే అని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రభాస్ సందీప్ వంగాతో 'స్పిరిట్', అలాగే ప్రశాంత్ నీల్​తో 'సలార్​' సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. వీటితో పాటు నాగ్ అశ్విన్ 'కల్కి 2898' సినిమా కూడా ప్రభాస్ లైనప్​లో ఉంది.

ప్రభాస్ రాజాసాబ్​ లేటెస్ట్ లీక్ - సెట్స్​లోకి అడుగుపెట్టిన ఆ హీరోయిన్​! - Prabhas Rajasaab

కల్కి రిలీజ్ వాయిదా- కొత్త డేట్​ ఫిక్స్!- థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? - Kalki 2898 AD Release Date

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.