ETV Bharat / entertainment

ప్రభాస్ రాజాసాబ్​ లేటెస్ట్ లీక్ - సెట్స్​లోకి అడుగుపెట్టిన ఆ హీరోయిన్​! - Prabhas Rajasaab

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 4:10 PM IST

Prabhas Rajasaab
Prabhas Rajasaab

Prabhas Rajasaab : పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్​ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్​ లీక్ అయింది. ఆ హీరోయిన్​ సినిమా షూటింగ్​లో పాల్గొందని తెలిసింది. ప్రభాస్​తో పాటు ఈమెపై చిత్రీకరణ చేస్తున్నారట. పూర్తి వివరాలు స్టోరీలో.

Prabhas Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే మారుతీ డైరక్షన్​లో తెరకెక్కుతున్న 'ద రాజా సాబ్' సినిమా కూడా చేస్తున్నారు. హర్రర్ - కామెడీగా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే 'ద రాజా సాబ్' సినిమా లేటెస్ట్ అప్‌డేట్ విషయానికొస్తే 'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుందని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఆమె హైదరాబాద్​లో వేసిన ఈ మూవీ సెట్‌లో కనిపించారట. సినిమా షూటింగ్ కోసమే ఆమె అక్కడకు వచ్చారనీ, కొన్ని రోజుల పాటు తాజా షెడ్యూల్​లో ప్రభాస్​తో కలిసి నటించనున్నారనీ వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.

ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటుగా మాళవిక మోహన్, రిద్ది కుమార్ కూడా ఫిమేల్ లీడ్ రోల్స్​లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం 2025 వరకు ఈ చిత్రం థియేటర్లలోకి రాదని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రభాస్ లుంగీ పోస్టర్​ ఫ్యాన్స్​ను బాగానే ఆకట్టుకుంది.

కాగా, నిధి అగర్వాల్ తెలుగులో ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో ప్రేక్షకులను బాగానే మెప్పించినప్పటికీ ఆ తర్వాత ​ టాలీవుడ్​లో పెద్దగా కనిపించలేదు. నిధి నటించిన హీరో, మజ్ను, సవ్యసాచి సినిమాలు అంతగా కమర్షియల్ సక్సెస్ సాధించకపోవడం కారణం అయి ఉండచ్చు. అయితే బాలీవుడ్​లో "మున్నా మైఖేల్" సినిమాలో టైగర్ ష్రాఫ్​తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. ఇక తమిళంలో ప్రముఖ నటుడు శింబుతో 'ఈశ్వరుడు' సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే నిధి శింబుకి మధ్యలో ఎఫైర్ ఉందంటూ అప్పట్లో రూమర్లు కూడా బాగానే వినిపించాయి. పెళ్లి కూడా అయిందని చెప్పుకొచ్చారు. తర్వాత దీన్ని శింబు ఫ్యామిలీ ఖండించింది.

'విశ్వంభర' కోసం డేరింగ్ స్టంట్!- చిరు డెడికేషన్​కు హ్యాట్సాఫ్​! - Vishwambhara Chiranjeevi

కాశీ నమో ఘాట్​లో రణ్​వీర్, కృతి ర్యాంప్ వాక్- ట్రెడిషనల్ లుక్​లో అదరహో! - Ranveer Singh Kriti Sanon

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.