ETV Bharat / entertainment

ఓం భీమ్ బుష్ కలెక్షన్స్ - అంచనాలకు మించి అదరగొట్టేస్తోంది - Om Bheem Bush Collections

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 9:34 AM IST

Om Bheem Bush Collections : శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఓం భీమ్ బుష్ అంచనాలకు మించి రాణిస్తోంది. మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. ఎన్ని కోట్లంటే?

ఓం భీమ్ బుష్ కలెక్షన్స్ - అంచనాలకు మించి అదరగొట్టేస్తోంది
ఓం భీమ్ బుష్ కలెక్షన్స్ - అంచనాలకు మించి అదరగొట్టేస్తోంది

Om Bheem Bush Collections : ఓం భీం బుష్ - ప్రస్తుతం బాక్సాఫీస్ ముందు ఈ పేరే వినిపిస్తోంది. మార్చి 22న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు బాగా రప్పిస్తోంది. తొలి షోతోనే మంచి టాక్ తెచ్చుకుని రోజురోజుకు రెస్పాన్స్ పెంచుకుంటూ ముందుకెళ్తోంది. దీంతో సామజవరగమన తర్వాత శ్రీవిష్ణుకు మరో హిట్​ వరుసగా ఖాతాలో పడినట్టైంది. ఇందులో శ్రీవిష్ణుతో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ హారర్ థ్రిల్లర్​గా వచ్చిన ఈ చిత్రాన్ని హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాల ఫైమ్​ శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించారు.

మొదట ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​, టీజర్, ట్రైలర్ కామెడీతో కడుపుబ్బా నవ్వించ్చాయి. ఇప్పుడు రిలీజైన సినిమా కూడా అంతే జోష్​తో తెగ నవ్విస్తోంది. ఫలితంగా ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు. సినిమాకు బాక్సాఫీస్ వద్ద బాగానే పైసల వర్షం కురుస్తోందట. పెట్టిన బడ్జెట్​కు లాభాలు వచ్చే దిశగా సాగుతూ పోతోంది.

ఈ చిత్రానికి తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.44 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తొలిరోజు 4.6 కోట్లు రాగా రెండో రోజు 5.84 కోట్లు వసూళ్లు వచ్చినట్లు తెలిసింది. USAలోనూ మంచి వసూళ్లు వస్తున్నాయట. ఇక మూడో రోజు వీకెండ్ సండే కావడంతో మరింత వసూళ్లు వచ్చినట్లు మూవీటీమ్ చెబుతోంది. బయట అందిన సమాచారం ప్రకారం మూడో రోడు మరో రెండు మూడు కోట్ల వరకు వచ్చాయట. డే3 సెన్సేషనల్ అంటూ మూవీటీమ్​ వీడియోను కూడా పోస్ట్ చేసింది. బుకింగ్స్​ జోరుగా జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి : భీమ్ బుష్ - ఇప్పుడు కుర్రాళ్ల చూపంతా ఈ ముద్దుగుమ్మపైనే! - Ayesha Khan

ఇక సినిమాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో పాటు ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. రాజ్ తోట - ఛాయాగ్ర‌హ‌ణం, సన్నీ MR - సంగీతం, శ్రీకాంత్ రామిశెట్టి - క‌ళ‌, విజయ్ వర్ధన్ - కూర్పు బాధ్యతలు చూసుకున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరించారు. రచన, దర్శకత్వం శ్రీ హర్ష కొనుగంటి చూసుకున్నారు. యు.వి.క్రియేష‌న్స్‌ స‌మ‌ర్ప‌ణ‌ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కళ్లు చెదిరిపోయాయి వర్మ - 53ఏళ్ల వయసులో రమ్యకృష్ణ అందాలు వేరే లెవల్​! - Ramya Krishna photoshoot

'నా అవసరాన్ని, ఆకలిని తీర్చింది వారిద్దరే' - హైపర్ ఆది ఎమోషనల్​ - Jabardasth Comedian Hyper Aadiఓం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.