ETV Bharat / entertainment

అమెరికాలో ఆగని టిల్లన్న జోరు - ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే? - DJ Tillu Square Collections

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 11:34 AM IST

Updated : Apr 3, 2024, 2:41 PM IST

అమెరికాలో ఆగని టిల్లన్న జోరు - ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
అమెరికాలో ఆగని టిల్లన్న జోరు - ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

DJ TILLU SQUARE COLLECTIONS : బాక్సాఫీస్ ముందు టిల్లన్న దూకుడు ఆగట్లేదు. ఓవర్సీస్​లోనూ జోరు చూపిస్తూ మోత మోగిస్తున్నాడు. ఇప్పటివరకు ఐదు రోజుల్లో ఈ చిత్రానికి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

DJ TILLU SQUARE COLLECTIONS : గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీలా వంటి భిన్న జోనర్​లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన హీరో సిద్ధు జొన్నలగడ్డ. కానీ ఈ చిత్రాలతో ఆశించిన స్థాయిలో ఆయనకు ఇమేజ్​ ఏమీ రాలేదు. ఇతర చిత్రాల్లోనూ సైడ్ క్యారెక్టర్​లు కూడా చేశారు. అయితే ఈ క్రమంలో DJ టిల్లుగా వచ్చి బాక్సాఫీస్ ముందు సౌండ్ మోగించాడు. ఇది యువతను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆయన స్టార్ స్టేటస్​ అందుకున్నారు. ఈ చిత్రం విడుదల అయ్యాక అన్ని వయసుల వారికి టిల్లు క్యారెక్టర్ తెగ నచ్చేసింది. "అట్లుంటాది మనతోని" అంటూ టిల్లు అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. హీరోయిన్​ను రాధిక అని పిలిచే విధానంతో పాటు ఆమెతో పడే పాట్లు ప్రేక్షకులను బాగా నవ్వించాయి.

అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా బాగా హైప్ పెంచి ఇప్పుడు టిల్లు స్క్వేర్​తో వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇందులోనూ టిల్లు వన్ లైనర్ పంచులతో అదరగొట్టేశాడు. హీరోయిన్​గా అనుపమ పరమేశ్వరన్ బోల్డ్​గా నటించి ఫస్ట్ పార్ట్​లో ఉన్న రాధికకు ఏమాత్రం తీసిపోనట్టుగా లిల్లీ పాత్రతో ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ ముందు టిల్లన్న జోరు ఆగట్లేదు. తెలుగు చిత్రసీమ బాక్సాఫీస్​తో పాటు ఓవర్సీస్​లోనూ దూకుడు ఇంకా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ చిత్రానికి ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్​ వసూలు అయినట్లు తెలిసింది. ఇక వరల్డ్​ వైడ్​ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకునేందుకు మరింత చేరువగా వచ్చినట్లు మూవీటీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఐదు రోజుల్లో రూ.85 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లు తెలిపింది. మా స్టార్ బాయ్​ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

సినిమా విషయానికొస్తే వన్ నైట్ స్టాండ్​లో లిల్లీని కలిసిన టిల్లు ఆ తర్వాత తను చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో బాధ పడతాడు. ఆ తర్వాత రాధికతో ఇబ్బంది పడినట్లే లిల్లీతో కూడా ఇబ్బంది పడతాడు. స్క్రీన్ మీద టిల్లు పాట్లు పడుతుంటే చూస్తున్న ప్రేక్షకులు అతని కామెడీ టైమింగ్​కు తెగ నవ్వుకుంటున్నారు. ఇకపోతే టిల్లు స్క్వేర్ హిట్ ఇచ్చిన కిక్​తో ఈ సినిమాకు మూడో భాగాన్ని కూడా అప్పుడే అనౌన్స్ చేసేశారు మేకర్స్​. DJ టిల్లులో రాధికతో, టిల్లు స్క్వేర్​లో లిల్లీతో పాట్లు పడిన టిల్లన్న మరి టిల్లు క్యూబ్​లో ఎవరితో పాట్లు పడతాడో చూడాలి.

మోత మోగిస్తున్న టిల్లు స్క్వేర్​ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? - Tillu Square OTT

లక్ష బీర్ బాటిళ్లతో స్పెషల్ సెట్​ - భారీ రిస్క్ చేస్తున్న మెగాస్టార్! - Viswambara Shooting

Last Updated :Apr 3, 2024, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.