ETV Bharat / education-and-career

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం - ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఎంట్రీ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 8:31 PM IST

Updated : Mar 1, 2024, 10:10 PM IST

Telangana Intermediate Exams 2024 : ఇంటర్​ విద్యార్థులకు ఇంటర్మీడియట్​ బోర్డు తీపి కబురు చెప్పింది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల లోపు కేంద్రానికి చేరుకోవాలని గతంలో ఇంటర్​ బోర్డు ఆదేశించింది. తాజా నిర్ణయంతో ఉదయం 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉంటుందని తెలిపింది.

Telangana Intermediate Exam
Telangana Intermediate Exams 2024

Telangana Intermediate Exams 2024 : ఇంటర్​ విద్యార్థులకు ఇంటర్మీడియట్​ బోర్డు(Inter Board) తీపి కబురు చెప్పింది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించింది. దీంతో నిమిషం నిబంధనను ఎత్తేసినట్లు ఇంటర్​ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 9 గంటల లోపు కేంద్రానికి చేరుకోవాలని గతంలోనే ఇంటర్​ బోర్డు ఆదేశించింది. తాజా నిర్ణయంతో ఉదయం 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఇంటర్​ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

ఇంటర్​ పరీక్షలు : రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్​ పరీక్షలకు(Inter Exams 2024) అధికారులు నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేశారు. మొదటిరోజే సుమారు 12 మంది విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ఆదిలాబాద్​లో జిల్లాలో ఇంటర్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి పరీక్షకు హాజరవడం వల్ల లోపలికి అనుమతించలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీటిని ఆసరాగా చేసుకొని విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారేమోనన్న ఉద్దేశ్యంతో ఇంటర్​ బోర్డు నిమిషం నిబంధన నియమావళిని సవరించింది.

EAMCET Exam Preparation Tips : ఇలా ప్రిపేర్ అయితే.. ఎంసెట్​లో మంచి ర్యాంకు పక్కా

TS Inter Exams 2024 : అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇలాగే మార్చి 19 వరకు మొదటి, రెండో ఏడాది పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 9,80,978 మంది ఇంటర్​ విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వేగంగా చేరుకునేందుకు వీలుగా టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

నిమిషం నిబంధన రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఇంటర్​ బోర్డు తెలిపిన నేపథ్యంలో ఐదు నిమిషాలు ఆలస్యమైనా కూడా విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చు. కానీ ఐదు నిమిషాలు దాటిన తర్వాత మరి అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్(Section 144)​ను పకడ్బందీగా అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు మాస్​కాఫీయింగ్​, ఎలక్ట్రానిక్స్​ డివైజ్​లు వంటివి తీసుకువచ్చిన కఠిన చర్యలు ఉంటాయని అధికారులు విద్యార్థులకు హెచ్చరించారు.

ఇంటర్ పరీక్షలు ప్రారంభం - నిమిషం ఆలస్యమైన విద్యార్థులకు 'నో ఎంట్రీ'

తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్​ పరీక్షలు - పలుచోట్ల విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించని అధికారులు

Last Updated : Mar 1, 2024, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.