ETV Bharat / education-and-career

సెబీలో 'అసిస్టెంట్ మేనేజర్' పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 10:29 AM IST

SEBI Recruitment 2024 for 97 Assistant Manager posts
SEBI Recruitment 2024

SEBI Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. సెబీ 97 గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SEBI Recruitment 2024 : సెక్యూరిటీస్​ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 97 గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • జనరల్​ - 62 పోస్టులు
  • లీగల్ - 5 పోస్టులు
  • ఐటీ - 24 పోస్టులు
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 2 పోస్టులు
  • రీసెర్చ్​ - 2 పోస్టులు
  • అఫీషియల్ లాంగ్వేజ్​ - 2 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 97

విద్యార్హతలు
SEBI Assistant Manager Job Qualification : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్​ చూడండి.

వయోపరిమతి
SEBI Assistant Manager Job Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 మార్చి 31 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లు లోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
SEBI Assistant Manager Job Application Fee : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000+ 18% జీఎస్టీ చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా కట్టాలి.

ఎంపిక ప్రక్రియ
SEBI Assistant Manager Selection Process : అభ్యర్థులకు రెండు దశల్లో ఆన్​లైన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. అందులోనూ క్వాలిఫై అయిన వారిని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
SEBI Assistant Manager Salary : సెబీ అసిస్టెంట్ మేనేజర్​లకు రూ.44,500 నుంచి రూ.89,150 వరకు జీతం ఉంటుంది. దీనికి తోడు ఎన్​పీఎస్​, గ్రేడ్ అలవెన్స్​, స్పెషల్ అలవెన్స్​, డియర్​నెస్ అలవెన్స్​, ఫ్యామిలీ అలవెన్స్​, లోకల్ అలవెన్స్, లెర్నింగ్ అలవెన్స్​, స్పెషల్ గ్రేడ్ అలవెన్స్ కూడా అందిస్తారు.

దరఖాస్తు విధానం
SEBI Assistant Manager Application Process :

  • అభ్యర్థులు ముందుగా సెబీ అధికారిక వెబ్​సైట్ https://www.sebi.gov.in/ ఓపెన్ చేయాలి.
  • One Time Registration లింక్​పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన అన్ని వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.
  • దీనితో మీకొక రిజిస్ట్రేషన్ నంబర్​, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • ఈ రిజిస్ట్రేషన్ నంబర్​, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్​ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
  • వెంటనే మీకొక యూనిక్​ నంబర్​ జనరేట్ అవుతుంది. దానిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను భద్రపరుచుకోవాలి.

SEBI Recruitment 2024 Application Start Date :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 ఏప్రిల్​ 13

ఇంజినీరింగ్ అర్హతతో NHPCలో 280 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

డిగ్రీ అర్హతతో EPFOలో 323 పర్సనల్ అసిస్టెంట్​ ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.