ETV Bharat / education-and-career

ఇంజినీరింగ్ అర్హతతో NHPCలో 280 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 10:21 AM IST

NHPC Recruitment 2024
NHPC Engineer Jobs 2024

NHPC Engineer Jobs 2024 : ఇంజినీరింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. నేషనల్​ హైడ్రో ఎలక్ట్రిక్​ పవర్​ కార్పొరేషన్ లిమిటెడ్​ (ఎన్​హెచ్​పీసీ) 280 ట్రైనీ ఇంజినీర్​, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

NHPC Engineer Jobs 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'నేషనల్​ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్​ కార్పొరేషన్ లిమిటెడ్​' (NHPC) 280 ట్రైనీ ఇంజినీర్​, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ట్రైనీ ఇంజినీర్​ (సివిల్​) : 95 పోస్టులు
  • ట్రైనీ ఇంజినీర్​ (ఎలక్ట్రికల్​​) : 75 పోస్టులు
  • ట్రైనీ ఇంజినీర్​ (మెకానికల్​​) : 77 పోస్టులు
  • ట్రైనీ ఇంజినీర్​ (E&C) : 04 పోస్టులు
  • ట్రైనీ ఇంజినీర్​ & ట్రైనీ ఆఫీసర్​ (ఐటీ) : 20 పోస్టులు
  • ట్రైనీ ఇంజినీర్​ & ట్రైనీ ఆఫీసర్​ (ఎన్విరాన్​మెంట్​) : 06 పోస్టులు
  • ట్రైనీ ఆఫీసర్​ (జియోలజీ) : 03 పోస్టులు
  • మొత్తం పోస్టులు : 280

విద్యార్హతలు
NHPC Engineer Job Qualification : అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి బీఎస్​ఈ, బీఈ/బీటెక్​, ఎంఈ/ఎంటెక్​, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే గేట్​-2023 స్కోర్ కచ్చితంగా ఉండి తీరాలి.

వయోపరిమితి
NHPC Engineer Job Age Limit : అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
NHPC Engineer Job Application Fee : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.600+ టాక్స్​లు కలిపి రూ.708 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్​, ఎస్టీ, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
NHPC Engineer Selection Process : అభ్యర్థులను గేట్​-2023 స్కోర్ ఆధారంగా షార్ట్​ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి గ్రూప్​ డిస్కషన్​, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి, అర్హులైన వారిని ట్రైనీ ఇంజినీర్​, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
NHPC Engineer Salary : ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్​లకు నెలకు రూ.50,000 - రూ.1,60,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం
NHPC Engineer Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఎన్​హెచ్​పీసీ అధికారిక వెబ్​సైట్​ https://www.nhpcindia.com/ ఓపెన్ చేయాలి.
  • హోంపేజ్​లోని కెరీర్స్​ ఆప్షన్స్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • ముఖ్యమైన పత్రాలు అన్నింటినీ అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
NHPC Recruitment 2024 Apply Last Date :

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 6
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మార్చి 26

డిగ్రీ అర్హతతో EPFOలో 323 పర్సనల్ అసిస్టెంట్​ ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!

THDCILలో 100 ఇంజినీర్ పోస్టులు - లక్షల్లో జీతం - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.