ETV Bharat / education-and-career

THDCILలో 100 ఇంజినీర్ పోస్టులు - లక్షల్లో జీతం - అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 10:56 AM IST

THDCIL Recruitment 2024
THDCIL Engineer Jobs 2024

THDCIL Engineer Jobs 2024 : ఇంజినీరింగ్ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. మినీ రత్న హోదా కలిగిన THDCIL - 100 ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

THDCIL Engineer Jobs 2024 : నేషనల్​ థర్మల్​ పవర్​ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని 'టీహెచ్​డీసీఎల్'​ 100 'ఇంజినీర్ ట్రైనీ' పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడవులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రైనీ ఇంజినీర్​ పోస్టుల వివరాలు

  • సివిల్ - 40 పోస్టులు
  • ఎలక్ట్రికల్ - 25 పోస్టులు
  • మెకానికల్ - 30 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్​ & ఇన్​స్ట్రుమెంటేషన్​ - 5 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 100

విద్యార్హతలు
THDCIL Job Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా సివిల్​/ ఎలక్ట్రికల్​/ మెకానికల్​/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యునికేషన్ ఇంజినీరింగ్​ల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
THDCIL Engineer Job Age Limit :

  • అభ్యర్థుల వయస్సు 2024 ఫిబ్రవరి 28 నాటికి 18 ఏళ్లు - 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు కూడా వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
THDCIL Engineer Job Fees :

  • జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి.
  • దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్​, డిపార్ట్​మెంటల్​ క్యాండిడేట్స్​, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
THDCIL Engineer Trainee Selection Process : గేట్​-2023 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​ లిస్ట్ చేస్తారు. తరువాత వీరికి గ్రూప్​ డిస్కషన్​, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఎంపిక చేస్తారు.

సాలరీ
THDCIL Engineer Trainee Salary : ఇంజినీర్ ట్రైనీలకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు సాలరీ ఇస్తారు.

దరఖాస్తు విధానం
THDCIL Engineer Trainee Application Process :

  • అభ్యర్థులు ముందుగా టీహెచ్​డీసీఐఎల్​ అధికారిక వెబ్​సైట్​ https://thdc.co.in/ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • అప్పుడు మీకొక రిజిస్ట్రేషన్​ నంబర్, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • వీటితో మరలా వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు, గేట్​ స్కోర్ నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • తరువాత వివరాలు అన్నీ మరోసారి చెక్​ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు
THDCIL Engineer Trainee Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఫిబ్రవరి 28
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మార్చి 29

ఫ్రీలాన్సర్​గా పని చేయాలా? ఈ టాప్​-10 వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి!

పార్ట్ టైమ్ జాబ్​ చేయాలా? ఈ టాప్​-10 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.