ETV Bharat / business

సూపర్ న్యూస్: ఎవ్వరితోనూ పనిలేదు - సాధారణ ప్రజలకు రూ.1 లక్ష, వ్యాపారులకు రూ.15 లక్షల రుణం! - PM Suraj Portal Loan

author img

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 2:45 PM IST

PM Suraj Portal Loan : డబ్బుతో ఒక్కొక్కరి అవసరం ఒక్కో విధంగా ఉంటుంది. అందుకే.. కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా.. మధ్యవర్తులతో సంబంధం లేకుండానే రూ.లక్ష నుంచి 15 లక్షల వరకు రుణం పొందవచ్చు!

PM Suraj Portal
PM Suraj Portal Loan (ETV Bharat)

PM Suraj Portal Loan : దేశంలో ప్రజల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రవేశపెడతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పథకాల ద్వారా.. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల వారికి వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి సొంత కాళ్లపైన నిలబడేలా చేస్తున్నాయి. అయితే.. ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఇంకేదైనా పని చేయాలన్నా.. అందరినీ వేధించే సమస్య డబ్బు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవాలన్నా పలు అడ్డంకులు ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. ఎవరి మధ్యవర్తిత్వం లేకుండానే.. బ్యాంకుల వద్దకు వెళ్లకుండానే.. కేవలం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా రుణం పొందొచ్చు! లక్ష రూపాయల నుంచి గరిష్ఠంగా రూ. 15 లక్షల వరకు లోన్‌ అందుకునే అవకాశం ఉంది! ఇంతకీ ఆ పోర్టల్‌ ఏంటి? ఈ రుణానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ స్కీమ్​కు ఎవరు అర్హులు? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

నేరుగా బ్యాంకు ఖాతాలోకి :
ఈ ఏడాది మార్చి 13వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 'పీఎం సూరజ్‌ పోర్టల్‌'ను (PM Suraj Portal) ప్రారంభించారు. ఈ పోర్టల్‌ ద్వారా దేశంలోని షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుద్ధ్య కార్మికులకు రుణాలు అందిస్తారు. లోన్ పొందడానికి మీరు ఏ బ్యాంకు వద్దకూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. పీఎం సూరజ్‌ పోర్ట్‌లోకి వెళ్లి.. కావాల్సిన వివరాలు సమర్పించి అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేరుగా మీ బ్యాంక్‌ ఖాతాలోకే నగదు జమ అవుతుంది. ఈ విధానం ద్వారా లబ్ధిదారులకు రుణం పారదర్శకంగా అందుతుంది. ఇంకా సులభంగా అందుతుంది. ఎటువంటి మధ్యవర్తుల అవసరమూ ఉండదు. ఈ పథకానికి అర్హులైన వారికి రూ.లక్ష వరకు వ్యక్తిగత రుణం, రూ.15 లక్షల వరకు వ్యాపార రుణం అందిస్తారు. అయితే.. పీఎం సూరజ్‌ పోర్టల్‌ ద్వారా రుణం పొందడానికి.. దరఖాస్తుదారుడు కచ్చితంగా భారతీయుడై ఉండాలి.

కార్​ లోన్​ కావాలా? 2024లో బ్యాంకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

పీఎం సూరజ్‌ పోర్టల్‌లో రుణం పొందడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ :

  • ఆధార్‌ కార్డ్‌
  • ఐడెంటిటీ కార్డ్‌
  • రేషన్‌ కార్డ్‌
  • అడ్రస్‌ ప్రూఫ్‌
  • ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌
  • కుల ధ్రువీకరణ పత్రం
  • బ్యాంక్‌ అకౌంట్ పాస్‌ బుక్‌
  • పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో
  • ఈ-మెయిల్ ఐడీ
  • మరిన్ని వివరాల కోసం https://sbms.ncog.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

అప్పులు త్వరగా తీర్చేసేందుకు సూపర్ మార్గం ఇది! - how to clear loans fast

ఫేక్​ లోన్​ యాప్​లను ఇలా గుర్తించండి! - ఆ వలలో పడిపోతే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.