ETV Bharat / business

మీ ఫాస్టాగ్​ KYC పూర్తి చేశారా? లేదంటే ఖాతా బ్లాక్​ - ఇవాళే లాస్ట్ డేట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 6:03 PM IST

Updated : Jan 31, 2024, 11:33 AM IST

FASTag KYC Update Last Date In Telugu : వాహనదారులకు అలర్ట్​. మీరు జనవరి 31లోపు ఫాస్టాగ్​ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి మరికొద్ది గంటలే సమయం ఉంది. ఇవాళ మీరు ఫాస్టాగ్​ కేవైసీ పూర్తి చేయకుంటే, జనవరి 31 తర్వాత మీ ఫాస్టాగ్​లు డీయాక్టివేట్ అవుతాయి. పూర్తి వివరాలు మీకోసం.

How to update FASTag KYC
FASTag KYC update last date

FASTag KYC Update Last Date : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు 'వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్​' విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్​ను తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వాహనదారులు అందరూ తమ ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను జనవరి 31లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఒక వేళ గడువులోగా ఫాస్టాగ్​ కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే, జనవరి 31 తరువాత సదరు ఫాస్టాగ్​ అకౌంట్​ను బ్లాక్ అవుతుందని పేర్కొంది.

బ్యాలెన్స్ ఉన్నప్పటీ
ఫాస్టాగ్ అకౌంట్​లో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే సదరు అకౌంట్లను జనవరి 31 తరువాత డీయాక్టివేషన్ లేదా బ్లాక్ చేస్తామని NHAI తెలిపింది. దేశంలో దాదాపు 7 కోట్ల ఫాస్టాగ్​ అకౌంట్లు ఉన్నాయి. అయితే వాటిలో 4 కోట్ల అకౌంట్లు మాత్రమే యాక్టివ్​గా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా వీటిలో 1.2 కోట్ల ఫాస్టాగ్​లు నకిలీవని తేలింది. అందుకే ఈ సమస్యను నివారించేందుకు NHAI నూతన కేవైసీ పాలసీని ప్రవేశపెట్టింది.

FASTag KYC Update FAQs And Answers

ఫాస్టాగ్​ కేవైసీ పూర్తి అయిందో లేదో ఎలా తెలుస్తుంది?
ఫాస్టాగ్​ కేవైసీ స్టేటస్​ తెలుసుకోవాలంటే మీ ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ లేదా మీ బ్యాంక్ యాప్​లకు వచ్చిన నోటిఫికేషన్‌లను చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్‌లు మీ ఫాస్టాగ్​ కేవైసీ పూర్తికాకపోతే మిమ్మల్ని హెచ్చరిస్తాయి. అప్పుడు మీరు వెంటనే ఆన్​లైన్​లో ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి.

ఒక వేళ మీ ఈ-మెయిల్​, బ్యాంకు యాప్​లకు ఫాస్టాగ్​కు సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ రాలేదంటే, మీ ఫాస్టాగ్ కేవైసీ పూర్తి అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. కనుక మీరు కంగారు పడకుండా నిశ్చింతగా ఉండవచ్చు.

ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
మీరు మీ ఫాస్టాగ్​ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకునేందుకు https://fastag.ihmcl.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మీ వివరాలను నమోదు చేసి, పోర్టల్​లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు మీ ఫాస్టాగ్​ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ అది ఇన్​కంప్లీట్​గా ఉంటే, అక్కడే కేవైసీని అప్​డేట్ కూడా చేసుకోవచ్చు.

సాధారణంగా వివిధ బ్యాంకులు ఫాస్టాగ్​లు జారీ చేస్తుంటాయి. అందువల్ల మీరు https://www.netc.org.in/request-for-netc-fastag లింక్​ను ఓపెన్ చేయాలి. మీకు ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్​ను ఎంచుకోవాలి. అక్కడే ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

ఆన్​లైన్​లో ఫాస్టాగ్ అప్​డేట్ చేయడం ఎలా?

  • ముందుగా FASTag అధికారిక వెబ్‌సైట్‌ https://fastag.ihmcl.com ఓపెన్ చేయాలి.
  • మై ప్రొఫైల్ సెక్షన్​లోకి వెళ్లి, KYC అనే సబ్-​సెక్షన్​ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • అందులో మీ ఫాస్టాగ్ కేవైసీ వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమనై ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
  • మీ పాస్​పోర్ట్ సైజ్ ఫొటోను అప్లోడ్ చేయాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్ చేసుకొని, డిక్లరేషన్​ను కన్ఫార్మ్ చేయాలి.
  • తరువాత అప్లికేషన్​ సబ్మిట్ చేయాలి.
  • అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత KYC ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
  • 7 పని దినాల్లో మీ ఫాస్టాగ్​ కేవైసీ అప్​డేట్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఫాస్టాగ్​ రీఛార్జ్ ఎవరు చేయాలి?

వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ విధానం ప్రకారం ఒక వాహనానికి ఒక ఫాస్టాగ్ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఎక్కువ ఫాస్టాగ్​లు ఉంటే, వాటిలోని లేటెస్ట్​ది తప్ప, మిగతావన్నీ డీయాక్టివేట్ అయిపోతాయి. రీఛార్జ్ విషయానికి వస్తే BBPS, UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫాస్టాగ్​ను రీఛార్జ్ చేసుకోవచ్చు.

సకాలంలో రుణాలు తీర్చకపోతే - బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా?

జనవరి 22న బ్యాంకులకు సెలవు ఉంటుందా? గవర్నమెంట్​ ఆఫీసుల సంగతేంటి?

Last Updated :Jan 31, 2024, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.