ETV Bharat / business

క్రెడిట్‌ కార్డు మంచిదే అనడానికి 6 కారణాలు - మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 5:16 PM IST

Debit Card And Credit Card Which Is Better
Debit Card And Credit Card Which Is Better

Debit Card And Credit Card Which Is Better : బ్యాంక్ అకౌంట్ ఉన్న అందరి వద్దా దాదాపుగా డెబిట్ కార్డు ఉంటుంది. కానీ.. వారంతా క్రెడిట్ కార్డు తీసుకోరు. పలు రకాల కారణాలతో వెనకడుగు వేస్తుంటారు. కానీ.. క్రెడిట్ కార్డు వల్ల 6 ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు!

Benefits of Credit Card : ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే చేతిలో డబ్బులుంటేనే పని జరిగేది. కానీ.. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో క్రెడిట్ కార్డులు, డెబిట్‌ కార్డులు, యూపీఐ సేవల వంటివి మన పనిని ఈజీ చేస్తున్నాయి. అయితే.. క్రెడిట్ కార్డు వల్ల పలు నష్టాలు ఉన్నాయంటూ చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ.. సరిగా వినియోగిస్తే 6 లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.

రివార్డ్ పాయింట్లు..
బ్యాంకులు తమ క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రతీ లావాదేవీపై రివార్డ్‌ పాయింట్లను అందిస్తుంటాయి. దీనివల్ల.. క్రెడిట్‌ కార్డ్‌ను వాడే వ్యక్తి రివార్డ్‌ పాయింట్లతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేయవచ్చు. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, ఎయిర్‌పోర్ట్‌ల వద్ద రివార్డ్‌ పాయింట్లతో డిస్కౌంట్స్‌ పొందొచ్చు. మన దేశంలో రివార్డ్స్‌ పాయింట్లు పొందడానికి అనేక రకాల క్రెడిట్‌ కార్డులున్నాయి. ఈ కార్డులు ప్రత్యేకమైన ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను యూజర్లకు అందిస్తాయి.

జాయినింగ్ బెన్‌ఫిట్స్‌..
క్రెడిట్‌ కార్డు యూజర్లు కొత్తగా కార్డును తీసుకుంటే బ్యాంకులు వారికి జాయినింగ్‌ బెన్‌ఫిట్స్‌ అందిస్తాయి. వీటిలో రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, కాంప్లీమెంటరీ మెంబర్‌షిప్‌ వంటివి ఉండే అవకాశం ఉంది. ఇంకా ఫ్రీ ఫ్లైట్‌ టికెట్స్‌, గిఫ్ట్‌ వోచర్స్ కూడా లభిస్తాయి. ఇవేవి డెబిట్‌ కార్డ్‌లకు వర్తించవు.

క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు..
క్రెడిట్‌ కార్డ్ యూజర్లను ఆకర్షించడానికి బ్యాంకులు పండగ సందర్భాలు, కొన్ని ఇతర సమయాల్లో క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను అందిస్తాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో షాపింగ్‌ చేయడం ద్వారా మరిన్ని లాభాలను యూజర్లు పొందవచ్చు. ఈ సదుపాయం కొన్ని కార్డులకు ఏడాది పొడవునా వర్తిస్తుంది. కొన్ని బ్యాంకులు క్యాష్‌బ్యాక్ బెన్‌ఫిట్‌లను ఒక శాతం నుంచి 15 శాతం వరకు అందిస్తున్నాయి. ఈ బెన్‌ఫిట్స్‌ వల్ల క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లు ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్- లిమిట్​లో కోత- రివార్డ్ పాయింట్లూ కష్టమే!

సురక్షితమైన లావాదేవీలు..
డెబిట్‌ కార్ట్‌తో జరిపే లావాదేవీల కంటే క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసే లావాదేవీలు చాలా వరకు సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్‌ కార్డు యూజర్ల లావాదేవీలు సురక్షితంగా ఉండేలా బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటాయని అంటున్నారు.

క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుంది..
మరో ముఖ్యమైన అంశం.. క్రెడిట్‌ కార్డును ఉపయోగించడం వల్ల మంచి క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుంది. దీని ద్వారా చెల్లింపులు జరిపి.. సకాలంలో క్యాష్‌ను తిరిగి చెల్లిస్తే మంచి క్రెడిట్‌ స్కోర్‌ మీ సొంతం అవుతుందని నిపుణులంటున్నారు. ఎవరైనా తమ క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోవాలంటే క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించడం కంటే వేరే ఉత్తమ మార్గం లేదని తెలియజేస్తున్నారు.

విస్తృతంగా ఆమోదం పొందుతుంది..
చాలా వరకు డెబిట్‌ కార్డులు దేశంలోని అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో యూజ్‌ చేసుకోవచ్చు. అయితే.. కొన్ని విదేశీ లవాదేవీలు చేయడం డెబిట్ కార్డుతో సాధ్యం కాదు. కానీ.. కొన్ని రకాల క్రెడిట్ కార్డుల వల్ల విదేశీ లావాదేవీలను సైతం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే డెబిట్‌ కార్డ్‌తో పోలిస్తే.. క్రెడిట్ కార్డ్ పరిధి మరింత విస్తృతంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ కారణాలతో డెబిట్ కన్నా.. క్రెడిట్ కార్డుతో మేలు ఎక్కువగా జరుగుతుందని చెబుతున్నారు.

How To Save Money Using Credit Card : పండుగ షాపింగ్ చేయాలా?.. ఈ క్రెడిట్ కార్డ్​ టిప్స్​తో.. మస్త్​ డబ్బులు ఆదా చేసుకోండి!

How to get Virtual Credit Card : మీకు వర్చువల్ క్రెడిట్ కార్డు తెలుసా..? వెంటనే తెలుసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.