ETV Bharat / bharat

ఫేక్​ రేప్​ కేసు పెట్టిన మహిళకు 4ఏళ్లు శిక్ష- ఆ యువకుడిలాగే ఆమె కూడా జైల్లో ఉండాలని తీర్పు - Youth Gets Justice After 4 Years

author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 4:30 PM IST

Youth Gets Justice After 4 Years
Youth Gets Justice After 4 Years (ANI)

Youth Gets Justice After 4 Years : చేయని నేరానికి సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు ఓ యువకుడు. చివరకు నిర్దోషిగా బయటపడ్డాడు. తప్పుడు కేసు పెట్టిన మహిళకు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో జరిగింది.

Youth Gets Justice After 4 Years : ఓ మహిళ తప్పుడు కేసుకు బలయ్యాడు ఓ యువకుడు. చేయని తప్పుకు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడం వల్ల 4ఏళ్ల 6నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. మహిళ తప్పడు కేసు పెట్టినందుకు ఆమెకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది కోర్టు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో జరిగింది.

ఇదీ జరిగింది
బరాదరి పోలీస్​ స్టేషన్​కు చెందిన ఓ మహిళ 2019 డిసెంబర్​ 2 తన కూతురిపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన 15ఏళ్ల కూతురిని అజయ్​ అలియాస్​ రాఘవ్​ నమ్మించి దిల్లీకి తీసుకెళ్లాడని, మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేశాడని అందులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మొదట అజయ్​ తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్​లో ఉండగా నిందితుడు నాలుగేళ్లుగా జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టులో విచారణలో తన వాంగ్మూలం​ తప్పని న్యాయమూర్తి ఎదుట ఆ బాలిక చెప్పింది. 2024 ఫిబ్రవరి 8న తాను చెప్పిన వివరాలు​ తప్పని తెలిపింది. అజయ్​ తనకు ఎలాంటి హాని చేయలేదని, అతడు తనని దిల్లీకి కూడా తీసుకెళ్లలేదని స్పష్టం చేసింది.

దీంతో అజయ్​ను నిర్దోషిగా ప్రకటించింది అడిషినల్​ సెషన్స్​ కోర్టు. తప్పుడు కేసు పెట్టినందుకు మహిళపై 340 సెక్షన్​ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు ఓ వ్యక్తి 1,653 రోజుల జైలులో గడిపేలా చేసినందుకు ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. అతడు శిక్ష అనుభవించినన్ని రోజులు మహిళను కూడా జైలులో ఉంచాలని జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి ఆదేశించారు. దీంతో పాటు రూ.5,88,822 జరిమానా విధించారు. ఒకవేళ ఈ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పును ఇచ్చారు. ఇలాంటి శిక్షలు వేస్తేనే ఇతరులు చట్టాన్ని ఉల్లంఘించరని అభిప్రాయపడ్డారు.

Police Gets Justice After 29 Years : చేయని నేరానికి 29 ఏళ్ల శిక్ష.. క్షమాపణలు కోరిన పోలీసులు

నిర్దోషి అయిన కొడుకు కోసం తల్లి పోరాటం.. ఏడేళ్ల క్రితం 'చనిపోయిన యువతి'ని తీసుకొచ్చి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.