ETV Bharat / bharat

రూ.49కే 48 గుడ్లంటూ ఆఫర్​- లింక్​పై క్లిక్ చేస్తే క్షణాల్లో రూ.48వేలు మాయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 8:39 PM IST

Eggs Offer Scam In Bengaluru : కేవలం రూ.49కే 48 గుడ్లు వస్తున్నాయనే ఆశతో గుర్తుతెలియని లింక్​పై క్లిక్ చేసిన ఓ మహిళను బురిడీ కొట్టించారు సైబర్​ కేటుగాళ్లు. ఏకంగా ఆమె బ్యాంక్​ అకౌంట్​లో నుంచి రూ.48వేలను కాజేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

Eggs Offer Scam In Bengaluru
Eggs Offer Scam In Bengaluru

Eggs Offer Scam In Bengaluru : రూపాయికో గుడ్డు చొప్పున రూ.49కి 4 డజన్ల గుడ్లు అంటూ వచ్చిన ఆఫర్​ లింక్​పై క్లిక్​ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. అత్యాశతో అనుమానాస్పద లింక్​పై క్లిక్​ చేసిన సదరు మహిళ బ్యాంక్​ ఖాతా​లో నుంచి ఏకంగా రూ.48వేలను స్వాహా చేశారు సైబర్​ మోసగాళ్లు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

అసలేం జరిగిందంటే
బెంగళూరులోని వసంతనగర్‌కు చెందిన ఓ మహిళకు ఈనెల 17న ఓ ఆన్​లైన్​ షాపింగ్​ కంపెనీ నుంచి ఈ-మెయిల్​ సందేశం వచ్చింది. అందులో కేవలం రూ.49కే 48 గుడ్లు (4 డజన్లు) అంటూ ఆఫర్​ మెసేజ్​ వచ్చింది. దీంతో ఆశతో మెయిల్​లో ఉన్న లింక్​పై క్లిక్​ చేసి గుడ్లను బుక్​ చేయబోయింది. ఆర్డర్​ డెలివరీ కోసం ఇంటి చిరునామా సహా వ్యక్తిగత నెంబర్​ను కూడా అందులో నింపింది. ఇక ఆఫర్​ పేమెంట్​ రూ.49ని చెల్లించేందుకు తన క్రెడిట్​ కార్డు వివరాలను నమోదు చేసింది. ధ్రువీకరణ కోసం ఆమె మొబైల్​కు వచ్చిన ఓటీపీని నెంబర్​ను సంబంధిత బాక్స్​లో నింపింది. దీంతో ఆమె అకౌంట్​లో నుంచి రూ.49 కట్​ అయ్యాయి. అయితే ఈ లావాదేవీ జరిగిన కొద్ది క్షణాలకే ఆమె ఫోన్​కు రూ.48,199లు బ్యాంక్​ ఖాతా నుంచి డెబిట్​ అయినట్లుగా మరో మెసేజ్​ వచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగుతున్న ఆ మహిళ తాను మోసపోయానని గ్రహించింది. వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించి తన క్రెడిట్​ కార్డును బ్లాక్ చేయాలని కోరింది. అనంతరం బెంగళూరులోని హై గ్రౌండ్స్​ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

రూ.20తో నెలంతా నెట్​ఫ్లిక్స్​?
ఇటీవల పెరుగుతున్న ఓటీటీల వినియోగం సైబర్‌ నేరగాళ్లకు జేబు నింపుతోంది. తప్పుడు సందేశాలతో రూ.లక్షలు కొట్టేస్తున్నారు. ఇందులో భాగంగా అమెజాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదికి రూ.50 డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ జీవితకాల సభ్యత్వం రూ.1,499, రూ.20 కట్టి నెట్‌ఫ్లిక్స్‌ నెలంతా వాడుకోవచ్చు లాంటి ఈ-మెయిళ్లు, వాట్సాప్‌ సందేశాలను వినియోగదారులకు పంపిస్తున్నారు. ఇలాంటి అనుమానస్పద మెసేజ్​ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా కేసులు తరచుగా నమోదవుతున్నాయి చెబుతున్నారు.

మోదీ మరో డేరింగ్​ స్టంట్​- సముద్ర గర్భంలోకి వెళ్లి శ్రీ కృష్ణుడికి పూజలు

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఏడుగురు దుర్మరణం- మరో ఏడుగురు సీరియస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.