ETV Bharat / bharat

సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరించొద్దు- అలా చేస్తే చర్యలు తప్పవ్​ : పార్టీలకు ఈసీ వార్నింగ్​ - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 8:59 AM IST

Updated : May 3, 2024, 9:38 AM IST

Election Commission Of India
Election Commission Of India(ANI PHOTO)

EC Warning To Political Parties : సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్‌ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

EC Warning To Political Parties : ఎన్నికల తర్వాత వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామంటూనో, సర్వేల పేర్లతోనో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకటనల ద్వారా, మొబైల్‌ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఆ విధానాన్ని వీడాలని తెలిపింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సర్వేల మధ్య ఉండే విభజన రేఖను కొన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చెరిపివేసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఈసీ పేర్కొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇటువంటివన్నీ అవినీతికి పాల్పడడంగానే పరిగణిస్తామని చెప్పింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు పంపించిన సూచనల్లో వివరించింది. ఈ తరహా అనైతిక చర్యలపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులనూ ఈసీ ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127ఏ ప్రకారం ఏదైనా ఎన్నికల కరపత్రం లేదా పోస్టర్​పై ప్రచురణ కర్తల పేర్లు, చిరునామాలు లేకపోయినా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నగదు, మద్యం ఏరులైపారుతోంది. ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి భారీగా నగదు జప్తు చేస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి రోజుకు రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేస్తున్నట్లు ఇటీవల భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. 75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో జప్తులు ఈసారే రికార్డుస్థాయిలో నగదు జప్తు జరిగిందని ఈసీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా పోలింగ్‌ మొదలు కాకముందే ఏప్రిల్​ 15 వరకు రూ.4,650 కోట్లను జప్తు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జప్తు చేసిన దానికంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఏడు విడతల్లో పోలింగ్‌ ముగిసే సమయానికి ఈ జప్తులు ఏ స్థాయికు చేరుతాయో అంచనాలకు అందని విధంగా ఉన్నాయని ఈసీ తెలిపింది. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జప్తులను ఎన్నికల సంఘం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాయ్​బరేలీ నుంచి బరిలో రాహుల్ గాంధీ- మరి అమేఠీ నుంచి ఎవరంటే? - Lok Sabha Elections 2024

బంగాల్​​ గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్​పై వేధింపుల ఆరోపణలు- పోలీసులకు మహిళ ఫిర్యాదు - West Bengal Governor Issue

Last Updated :May 3, 2024, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.