తెలంగాణ

telangana

పండుగ పూట విషాదం - కోలాటం ఆడుతూ కుప్పకూలిన మహిళ

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 6:38 AM IST

A Woman Died of a Heart Attack In Karimnagar

Woman Died While Dancing Karimnagar : ఈ రోజుల్లో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ, పెళ్లి బరాత్‌లో డాన్స్‌లు చేస్తూ, చిన్నపిల్లలు ఆడుకుంటూ గుండెపోటుతో మృత్యు కౌగిలిలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో కోలాటం ఆడుతూ ఒక మహిళ కుప్పకూలిపోయింది.

woman Died While Playing Kolatam : సంక్రాంతి వేళ కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగ పూట ఊరులోని యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. అనంతరం మహిళా కళాకారులు కోలాటం ఆడారు. అప్పటి వరకు హుషారుగా కోలాటమాడుతున్న ఓ మహిళ ఉన్నట్టుండి కుప్పకూలింది. గమనించిన తోటి కళాకారులు ఆమెను హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోలాటం ఆడుతుండగా అక్కడే ఉన్న యువకులు వీడియోను చరవాణిలో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

ABOUT THE AUTHOR

...view details