తెలంగాణ

telangana

పాలకుర్తిలో స్థానికేతర వివాదం - కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిరెడ్డి అత్తమామలకు నోటీసులు

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 4:25 PM IST

Police Notices to In laws of Congress Candidate Yashaswini Reddy

Police Notices to In laws of  Congress Candidate Yashaswini Reddy : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినిరెడ్డి అత్తమామలు అనుమాండ్ల ఝాన్సీ, రాజేందర్‌రెడ్డిలకు మంగళవారం పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. యశస్విని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రవాస భారతీయులైన తన అత్తమామలు (రాజేందర్‌రెడ్డి దంపతులు) మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పురపాలకలో అద్దెకు ఇల్లు తీసుకొని ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎన్‌ఆర్‌(నాన్ రెసిడెన్స్​) లు అయిన వారిద్దరూ తొర్రూరులో ఉండకూడదని ఈసీ ఆదేశాలతో డీఎస్పీ వెంకటేశ్వర బాబు నోటీసులు ఇచ్చారు.

విషయం తెలినన ఝాన్సీరెడ్డి అనుచరులు.. పెద్ద సంఖ్యలో ఇంటికి చేరి.. వారికి మద్దుతుగా నిలిచారు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను వివరణ కోరగా.. రెండు రోజుల కిందటే నిబంధనలు తెలియజేశామన్నారు. మొదట ఎస్సైతో నోటీసులు పంపగా తిరస్కరించడంతో ఎన్నికల అధికారుల సూచనల మేరకు డీఎస్పీ వెళ్లి ఇచ్చారని తెలిపారు. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీచేస్తోన్న తన కోడలిని ఒంటరిగా ఈ సమయంలో ఎలా వదిలి వెళతామన్నారు. నోటీసుపై సంతకం చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు  కంటతడి పెట్టారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని.. ఎవరెన్ని ఇబ్బందులకు గురి చేసినా భరిస్తామని అభ్యర్థిని యశస్వినీ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details