తెలంగాణ

telangana

మంథని నడిబొడ్డున నిలబడతాను- ధైర్యం ఉంటే చంపుకోండి : శ్రీధర్‌బాబు

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 4:38 PM IST

Updated : Nov 22, 2023, 4:47 PM IST

MLA SRIDHAR Babu BRS Leaders

MLA SRIDHAR Babu Fire on Police : పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాముత్తారం మండలం ఓడేడు గ్రామసర్పంచి బక్కారావుపై అధికార పార్టీకి చెందిన నాయకులు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు(Sridhar Babu) తన నివాసం నుంచి ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లగా.. పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. మంథనిలో రౌడీయిజం గూండాయిజం సంస్కృతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

MLA SRIDHAR Babu BRS Leaders: బీఆర్​ఎస్​ అభ్యర్థి(BRS Leader) పుట్ట మధు గురించి మాట్లాడితే హత్యకు గురైన వామన్‌రావు దంపతులకు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందని సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలు బెదిరించారని  తెలిపారు. వారి మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దీంతో మంథని నడిబొడ్డున తాను ఒంటరిగా వచ్చి నిలబడతానని.. ధైర్యం ఉంటే చంపుకోవాలని సవాలు విసిరారు. మంథనిలో శాంతియుత ఎన్నికల నిర్వహించాలని ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకుల దాడి గురించి స్థానిక ఆర్డీఓకు ఫిర్యాదు చేసినట్లు శ్రీధర్‌బాబు వివరించారు.

Last Updated : Nov 22, 2023, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details