తెలంగాణ

telangana

సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి తుమ్మల

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 5:05 PM IST

Minister Tummala Nageswara Rao on Seetharama Project

Minister Tummala Nageswara Rao on Seetharama Project :ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాల కుంటలోనీ సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 1.9 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సుమారు అర కిలోమీటర్​ వరకు మంత్రి తుమ్మల వెళ్లి, పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రెండు వైపుల నుంచి టెక్నాలజీని ఉపయోగించి పనులు వేగంగా చేయాలని ఆదేశించారు.

Minister Tummala about Seetharama Project : ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకు ఇచ్చేందుకు తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రూ.7000 కోట్లకు పైగా ఖర్చు జరిగిందని తుమ్మల వివరించారు. యాతాలకుంట టన్నెల్ పూర్తయితే బేతుపల్లి, లంక సాగర్​లకు నీళ్లు అందుతాయని, అలాగే గనుగులపల్లిలో నాలుగో పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉభయ జిల్లాలు అవుతాయని సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details