తెలంగాణ

telangana

పేస్ట్‌ రూపంలో గోల్డ్ క్యాప్సూల్స్‌.. రూ.2కోట్ల విలువైన బంగారం పట్టివేత

By

Published : Mar 29, 2023, 7:27 PM IST

పేస్ట్‌ రూపంలో బంగారు క్యాప్సూల్స్‌.. రూ.1.94 కోట్లు విలువైన బంగారం పట్టివేత

gold seized in shamshabad airport: స్మగ్లర్లు బంగారాన్ని తరలించడానికి వివిధ పద్దతులను వెతుకుతున్నారు. రోజురోజుకు వినూత్న మార్గాలను కనిపెడుతున్నారు. కనిపెట్టలేని విధంగా ప్లాన్​లు వేసి బంగారాన్ని తరలించాలనుకుంటున్నారు. చాలా తెలివిగా కస్టమ్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటారు.. కానీ అధికారులు వారిపై నిఘా పెట్టి గుట్టు రట్టు చేస్తుంటారు. అధికారులు తమదైన శైలిలో స్మగ్లర్లను దర్యాప్తు చేస్తే ఇట్టే దొరికిపోతున్నారు.

అలాంటి సంఘటనే శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు భారీగా అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున దుబాయ్‌ నుంచి వచ్చిన నలుగురు మహిళలను నిఘా విభాగం అధికారులు తనిఖీ చేశారు. వారు పేస్ట్‌ రూపంలో బంగారు క్యాప్సూల్స్‌ తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మలద్వారంలో దాచుకుని తెచ్చినట్లు గుర్తించారు. వారి నుంచి అధికారులు బంగారం క్యాప్సూల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. రూ.1.94 కోట్లు విలువైన 3,175 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఆ మేరకు వారిపై కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details