తెలంగాణ

telangana

Help : జర్నలిస్టు గిరిబాబు కుటుంబానికి సింధూజ, అపోలో సీఈవో ఆపన్నహస్తం

By

Published : Jun 5, 2021, 9:52 PM IST

Updated : Jun 6, 2021, 10:46 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్​ గిరిబాబు కుటుంబ సభ్యులకు ఆదుకునేందుకు పలువురు ముందుకు వచ్చారు. ఆ చిన్నారుల బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

Help: ఆ పిల్లల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి
Help: ఆ పిల్లల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్​ గిరిబాబు కుటుంబ సభ్యులకు షర్మిల పార్టీకి చెందిన యువ నాయకురాలు సింధూజ రూ.25వేలు, అపోలో ఆసుపత్రి సీఈవో సుబ్రమణ్యం రూ.25వేలను అందజేశారు. సామాజిక వేత్త వెంపటి విజయ్​కుమార్​ చొరవతో గిరిబాబు కుటుంబానికి సాయమందింది.

Help : జర్నలిస్టు గిరిబాబు కుటుంబానికి సింధూజ, అపోలో సీఈవో ఆపన్నహస్తం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో గిరిబాబు కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. డాడీ రా.. డాడీ లేచి రా.. అని పసి హృదయాలు పిలుస్తుంటే.. గుండె ముక్కలవుతుందని సింధూజ రెడ్డి అన్నారు. తండ్రి లేని లోటు.. ఆ ఆడపిల్లలకు జీవితాంతం తీర్చలేనిదని వెల్లడించారు. కరోనా మహమ్మారి విజృంభణకు కొవిడ్​ ఫ్రంట్​లైన్ వారియర్లు జర్నలిస్టులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ప్రాంతానికి చెందిన పాత్రికేయుడు గిరిబాబు కొవిడ్​ మహమ్మారితో ప్రాణాలు కోల్పోవడం.. ఆయన కుటుంబం అనాథగా మారిందని వెల్లడించారు. ఆ చిన్నారులను ఆదుకునేది ఎవరని ప్రశ్నించారు. ఆ ఇద్దరు చిన్నారుల విద్యాభ్యాసం బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని అన్నారు.

ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'

Last Updated :Jun 6, 2021, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details