తెలంగాణ

telangana

'ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది'

By

Published : Oct 30, 2020, 7:26 PM IST

యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(ఐకేపీ సెంటర్) ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

dccb chairman gongidi mahendar reddy startted ikp center at gourayipalli in yadagirigutta mandal
'ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది'

పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని గౌరాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, యాదగిరిగుట్ట పీఏసీఎస్ ఛైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:శిశువును అమ్మేసి.. మళ్లీ తన బిడ్డను తమకు ఇవ్వాలంటూ..

ABOUT THE AUTHOR

...view details