తెలంగాణ

telangana

మాయదారి మహమ్మారి నుంచి మమ్మల్ని రక్షించు తండ్రీ!

By

Published : Sep 1, 2020, 10:00 AM IST

కరోనా నుంచి విముక్తి కలిగించమని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఐనవోలు మల్లన్న స్వామిని వేడుకున్నారు. ఎమ్మెల్యే రమేశ్​తో పాటు వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన మంత్రి.. ఐనవోలు మల్లన్నను దర్శించుకున్నారు.

telangana bc welfare minister gangula kamalakar
ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి గంగుల

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఐనవోలు మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే రమేశ్​తో పాటు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మాయదారి కరోనా మహమ్మారి నుంచి ప్రజలందర్ని కాపాడాలని మంత్రి గంగుల మల్లన్న స్వామిని వేడుకున్నారు. కరోనా మహమ్మారి వల్ల నిరంతరం భక్తులతో కిటకిటలాడే కోరమీసాల మల్లన్న క్షేత్రం.. కళ తప్పిందన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details