ETV Bharat / bharat

ముఖర్జీ మరణంపై ఆరెస్సెస్, భాజపా విచారం

author img

By

Published : Aug 31, 2020, 10:00 PM IST

మాజీ రాష్ట్రపతి మృతి పట్ల భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అత్యంత శ్రద్ధతో దేశ సేవలో పాల్గొన్నారని నడ్డా కొనియాడారు. ముఖర్జీతో వ్యక్తిగతంగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అడ్వాణీ పేర్కొన్నారు. సంఘ్ పరివార్​కు ముఖర్జీ ఓ మార్గర్శకుడని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

Mukherjee served country with diligence; admired across party lines: BJP chief JP Nadda
ముఖర్జీ మరణంపై ఆరెస్సెస్, భాజపా విచారం

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల భాజపా సీనియర్ నేత ఎల్​కే అడ్వాణీ సంతాపం తెలిపారు. ఓ సహచరుడి కన్నా ఎక్కువగా వ్యక్తిగతంగా ప్రణబ్ ముఖర్జీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా జీవితానికి వెలుపలా తమ ఇద్దరి మధ్య విలువైన జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. ఇద్దరం కలిసి భోజనం చేసిన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ తన మదిలో ఉంటాయని తెలిపారు.

  • To me personally, he was more than a colleague & we've shared valuable moments both inside & outside our public lives, which extended to our families. Memories of various shared lunches will always be special in my heart: LK Advani, senior BJP leader. #PranabMukherjee (File pics) pic.twitter.com/9kpqG4GFju

    — ANI (@ANI) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నడ్డా

ముఖర్జీ మరణం పట్ల భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అత్యంత శ్రద్ధతో దేశానికి సేవ చేశారని, పార్టీలకు అతీతంగా ఆయన ఆదరణీయుడని అన్నారు.

  • Saddened by the demise of former President and statesman Shri Pranab Mukherjee. He has served the Country in many roles with diligence and determination. He is widely admired across the parties for his intellect and perseverance . My condolences to his family and followers.

    — Jagat Prakash Nadda (@JPNadda) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మాజీ రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ మరణం విచారకరం. ఎన్నో పదవులను అలంకరించిన ఆయన.. అత్యంత శ్రద్ధ, సంకల్పంతో దేశానికి సేవలందించారు. ఆయన తెలివి, పట్టుదల.. పార్టీలకు అతీతంగా ఆదరించేలా చేసింది. ఆయన కుటుంబసభ్యులకు, అనుచరులకు నా సానుభూతి."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

శివరాజ్ సింగ్

ప్రణబ్ ముఖర్జీ మృతి వార్త తనకు బాధ కలిగించిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఓ పుత్రుడిని భరతమాత కోల్పోయిందని అన్నారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రణబ్ కుటుంబసభ్యులు ఈ విచారం నుంచి బయటపడేందుకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

  • पूर्व राष्ट्रपति श्रद्धेय प्रणब मुखर्जी को विनम्र श्रद्धांजलि। https://t.co/t7NCMaP9be

    — Office of Shivraj (@OfficeofSSC) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆరెస్సెస్ చీఫ్​..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. సంఘ్ పరివార్​కు ముఖర్జీ ఓ మార్గర్శకుడని చెప్పారు. రాజకీయ అంటరాని తనాన్ని ఆయన ఎప్పుడూ విశ్వసించేవారు కాదని, అన్ని పార్టీల నేతలకు ఆయన గౌరవనీయుడని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషితో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు భగవత్. జాతి ప్రయోజనాలపైనే ప్రధానంగా దృష్టిసారించిన ఉత్తమ నిర్వాహకుడు ముఖర్జీ అని కొనియాడారు.

  • पूर्व राष्ट्रपति श्री प्रणब मुखर्जी को पू. सरसंघचालक और मा. सरकार्यवाह जी की श्रद्धांजलि : pic.twitter.com/VHoEwo7iKe

    — RSS (@RSSorg) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సంఘ్​కు ప్రణబ్ ముఖర్జీ మార్గదర్శకుడు. సంస్థ పట్ల ఆయనకు ఆప్యాయత ఉంది. ప్రణబ్​ కన్నుమూయడం ఆరెస్సెస్​కు కోలుకోలేని నష్టం."

-మోహన్ భగవత్, ఆరెస్సెస్ చీఫ్

రాందేవ్

ముఖర్జీ మృతిపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా స్పందించారు. 2011లో నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించిన సమయం నుంచి ముఖర్జీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దేశ రాజకీయాలకు ఆయన లేని లోటు తీరనిదని చెప్పారు.

  • I developed a deep personal bond with Pranab Mukherjee since he received me at the airport when I was to start a movement against black money, corruption & for system change in 2011 which continued till date. His demise is great damage to the nation & politics: Yoga guru Ramdev pic.twitter.com/kZgUVmFXG5

    — ANI (@ANI) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.