తెలంగాణ

telangana

'తెలంగాణ 'నీటి పరిరక్షణ' విధానాలు భేష్‌.. తక్షణమే పంజాబ్‌లో అమలు'

By

Published : Feb 16, 2023, 1:58 PM IST

Updated : Feb 16, 2023, 2:31 PM IST

Punjab CM Tour in Telangana: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌మాన్‌ నేతృత్వంలోని బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా కొండపోచమ్మ సాగర్‌, గజ్వేలులోని పాండవుల చెరువు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరు, వివిధ దశలను నీటి పారుదల శాఖ అధికారులు భగవంత్‌మాన్‌కు వివరించారు.

Punjab CM Tour in Telangana:
Punjab CM Tour in Telangana:

Punjab CM Tour in Telangana: తెలంగాణలో భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు వచ్చిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌మాన్‌ నేతృత్వంలోని బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. కొండపోచమ్మ సాగర్‌, గజ్వేలులోని పాండవుల చెరువు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరు, వివిధ దశలను నీటి పారుదల శాఖ అధికారులు భగవంత్‌మాన్‌కు వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన జల వనరుల పథకాలను మ్యాప్‌లు, చార్టులతో సవివరంగా తెలిపారు.

Punjab CM Visits Siddipet : రాష్ట్రంలో చేపట్టిన చర్యలపై భగవంత్‌సింగ్‌ మాన్‌ హర్షం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు. పంజాబ్‌లో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయని.. ఈ కార్యక్రమాలను తక్షణమే తమ రాష్ట్రంలోనూ అమలు చేయనున్నామని ఆయన వివరించారు.

''పంజాబ్‌లో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయి. చాలా చోట్ల నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి సీజన్‌లో అన్నదాతల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో తక్కుల కాలంలోనే మంచి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాలను మెరుగుపర్చుకున్నారు. వీటన్నింటినీ తక్షణమే మా రాష్ట్రంలో అమలు చేస్తాం.''- భగవంత్‌సింగ్‌మాన్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి

'తెలంగాణ 'నీటి పరిరక్షణ' విధానాలు భేష్‌.. తక్షణమే పంజాబ్‌లో అమలు'

Punjab CM Bhagwant Singhman Tour in Telangana భగవంత్‌సింగ్‌ మాన్‌తో పాటు ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు తెలంగాణలో మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణం, కాల్వలతో చెరువులు, చిన్న నీటి వనరులను నింపడం తదితరాలు, వాటి ఫలితాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు దాదాపు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వ అధ్యయనాల్లో తేలింది. దీంతో పంజాబ్‌ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు అమలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికారులు భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

నేడు సిద్దిపేట జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్

ప్రభుత్వ సంస్థలో 405 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే చాలు!

Last Updated : Feb 16, 2023, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details