ETV Bharat / state

నేడు సిద్దిపేట జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్

author img

By

Published : Feb 16, 2023, 9:06 AM IST

Updated : Feb 16, 2023, 10:28 AM IST

CM KCR and Punjab Chief Minister Visit Siddipet Today: రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు వచ్చిన పంజాబ్‌ సీఎం నేతృత్వంలోని బృందం నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి భగవంత్‌సింగ్‌మాన్‌ పలు ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంలను సందర్శించనున్నారు.

నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి పర్యటన
నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి పర్యటన

CM KCR Visits Siddipet Today: ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్‌ భగవంత్‌సింగ్‌, ఆయన బృందానికి వివరించనున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్కూక్‌లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ను మొదట సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్య ప్రవహించే కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువును సందర్శిస్తారు. పాండవుల చెరువు వద్ద రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు.

CM KCR and Punjab CM Visit Siddipet Today: రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ నేతృత్వంలోని బృందం బుధవారం రాత్రి రాష్ట్రానికి వచ్చింది. ఆయనతో పాటు ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లు కూడా వచ్చారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణకు గత కొన్నేళ్లుగా చేపట్టిన చర్యలను పంజాబ్ సీఎం, అధికారులు పరిశీలించనున్నారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణం తదితరాలు, వాటి ఫలితాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు.

మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలోని 26,700 గొలుసు కట్టు చెరువులను ప్రభుత్వం పునరుద్ధరించింది. నదులు, ఉప నదులు, వాగులు, వంకలపై 1375 చెక్‌డ్యాంలు నిర్మించింది. వీటితో పాటు ప్రాజెక్టులు, కాల్వలతో చెరువులు, చిన్న నీటి వనరులను నింపుతోంది. వీటితో రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. 2015 నుంచి 2022 వరకు నాలుగున్నర శాతం వరకు భూగర్భ జలాలు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

భూగర్భ జలాల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి..: పంజాబ్‌లో భూగర్భ జలాల కొరత ఉన్న నేపథ్యంలో తెలంగాణలో భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్, అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు పంజాబ్ సీఎం, అధికారులు నేడు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. భూగర్భ జలాల పరిరక్షణ చర్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల్లో కొన్నింటిని పరిశీలించే అవకాశం ఉంది.

Last Updated : Feb 16, 2023, 10:28 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.