ETV Bharat / bharat

ప్రభుత్వ సంస్థలో 405 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే చాలు!

author img

By

Published : Feb 16, 2023, 12:30 PM IST

సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (SECL) సంస్థ తాజాగా మైనింగ్‌ సర్దార్, డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

secl notification for 405 posts in 2023 february
SECLలో 405 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సౌత్ ఈస్టర్న్ కోల్​ లిమిటెడ్(ఎస్​ఈసీఎల్​)లో ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు శుభవార్త. 405 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. మైనింగ్ సిర్దార్, టెక్నికల్ & సూపర్‌వైజరీ గ్రేడ్ 'సి' పోస్ట్ ఇతర పోస్టుల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల ద్వారా అధికారిక వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 2023 ఫిబ్రవరి 03
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2023 ఫిబ్రవరి 23
  • దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది: 2023 ఫిబ్రవరి 24
  • సంతకం చేసిన దరఖాస్తు ఫామ్ ప్రింటౌట్ తీసుకోవడానికి చివరితేది: 2023 మార్చి7
    వ్రాత పరీక్షకు తేదీలు త్వరలో ఆఫీషియల్ వెబ్​సైట్​లో ప్రకటిస్తారు.

SECL ఖాళీల వివరాలు

  • మైనింగ్ సిర్దార్, టెక్నికల్ & సూపర్‌వైజరీ గ్రేడ్ 'సి' పోస్టు: 350 పోస్టులు
  • డి వై. సర్వేయర్, టెక్నికల్ & సూపర్‌వైజరీ గ్రేడ్ 4 'సి': 55 పోస్టులు

అర్హతలు:
మైనింగ్ సిర్దార్, టెక్నికల్ & సూపర్‌వైజరీ గ్రేడ్ 'సి' పోస్ట్​కు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఉత్తీర్ణత పొంది ఉండాలి.

  • మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. మైనింగ్‌ సర్దార్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ఎయిడ్‌ అండ్‌ గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై మూడేళ్ల మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి ఉండాలి. ఓవర్‌మెన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ ఎయిడ్‌ అండ్‌ గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.
  • డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఓపెన్‌ కాస్ట్, అండర్‌గ్రౌండ్‌ కోల్‌మైన్స్‌లో పనిచేసేట్లుగా సర్వే సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.
  • 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

రుసుము

  • జనరల్(UR)/ OBC (క్రీమీ లేయర్ & నాన్-క్రీమీ లేయర్)/EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 1,000+ రూ. 180 GST చెల్లించాలి.
  • ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా

  • దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి, ఫొటో అంటించి, సంతకం చేసిన దరఖాస్తును పోస్టులో పంపాలి. గవర్నమెంట్‌/ సెమీ గవర్నమెంట్‌/ పీఎస్‌యూల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 'నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌'ను దరఖాస్తుకు జతచేయాలి.
  • జనరల్‌ మేనేజర్‌ (పీ/ఎంపీ), ఎస్‌ఈసీఎల్, సీపట్‌ రోడ్, బిలాస్‌పుర్‌ (సీజీ) - 495 006.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.