తెలంగాణ

telangana

రక్షణరంగ అవసరాల ఆవిష్కరణల కోసం ఐఐటీ హైదరాబాద్ వినూత్న ప్రయత్నం

By

Published : Oct 19, 2022, 10:41 AM IST

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్ మరో వినూత్న ప్రయత్నాన్ని ప్రారంభించింది. రక్షణ రంగ అవసరాలను తీర్చేలా ఆవిష్కరణలు చేసే అంకుర సంస్థలకు అండగా ఉండనుంది. ఇందులో భాగంగా ఐడీఈఎక్స్​ డీఐఓతో కలిసి ఐఐటీ హైదరాబాద్‌లోని ఐటీఐసీ ఇంక్యూబెటర్ సంయుక్తంగా 'అక్లిమటైజేషన్ బూట్‌క్యాంప్' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

idex expo 2022
idex expo 2022

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్ మరో వినూత్న ప్రయత్నం ప్రారంభించింది. రక్షణ రంగ అవసరాలను తీర్చేలా ఆవిష్కరణలు చేసే అంకుర సంస్థలకు అండగా నిలవనుంది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్-డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్‌తో కలిసి ఐఐటీ హైదరాబాద్‌లోని ఐటీఐసీ ఇంక్యూబేటర్ సంయుక్తంగా 'అక్లిమటైజేషన్ బూట్‌క్యాంప్' అనే కార్యక్రమాన్ని రూపొందించింది.

సాధారణ అవసరాల కోసం ఆవిష్కరణలు చేస్తున్న అంకుర సంస్థలను.. రక్షణ రంగ అవసరాలపై పరిశోధనలు చేసేలా ప్రోత్సహించనున్నారు. గాంధీనగర్‌లో జరిగిన ఢిప్‌ ఎక్స్‌పో-2022లో ఇందుకు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. నాలుగు నెలల పాటు సాగే ఈ కార్యక్రమంలో మొదటి విడతగా 12 అంకుర సంస్థలకు అవకాశం కల్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details