తెలంగాణ

telangana

Mallikarjuna Kharge Release 12 Points SC And ST Declaration : చేవెళ్ల సభలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​.. విడుదల చేసిన ఖర్గే

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 9:10 PM IST

Updated : Aug 26, 2023, 9:35 PM IST

Mallikarjuna Kharge Release 12 Points SC And ST Declaration : తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తే.. ఆ క్రెడిట్​ అంతా ఒకే వ్యక్తి తీసుకున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ప్రజాగర్జన సభలో ఖర్గే 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను విడుదల చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్​రావు ఠాక్రే, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Election 2023 Congress Plan
Mallikarjuna Kharge Release 12 Points SC And ST Declaration

Mallikarjuna Kharge Release 12 Points SC And ST Declaration : కేసీఆర్​ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC Chief Mallikarjuna Kharge) అన్నారు. ఇక్కడి ప్రజల మనసు తెలుసుకుని సోనియా గాంధీ.. ఆనాడు తెలంగాణ(Telangana) ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తే.. ఆ క్రెడిట్​ అంతా ఒకే వ్యక్తి తీసుకున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో కేవీఆర్​ మైదానంలో జరిగిన ప్రజాగర్జన బహిరంగ సభలో 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్(SC,ST Declaration)​ పోస్టర్​ను మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

"కేసీఆర్​.. బయటకు బీజేపీని తిడతారు.. కానీ లోపల మాత్రం మంతనాలు జరుపుతారు. దీని ప్రకారం బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు రెండూ మిత్రపక్షాలే అని అర్థమవుతుంది. తన వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్​ ఇప్పుడు చెబుతున్నారు. నాడు సోనియాగాంధీతో ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయి. సోనియాతో ఫొటో తీసుకుని బయటకు రాగానే మాట మార్చారు. అలాగే కర్ణాటకలో చెప్పిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేశామని.. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 12 అంశాల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను అమలు చేస్తామని" ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు.

Telangana Congress Party Released Campaign Poster : 'తిరగబడదాం- తరిమికొడదాం' నినాదంతో కాంగ్రెస్

12 Points Telangana SC And ST Declaration : 53 ఏళ్ల కాంగ్రెస్​ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశామని ఖర్గే అన్నారు. మరి దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు దేశానికి ఏం చేశాయని ప్రశ్నించారు. నెహ్రూ, పటేల్​ కలిసి చిన్నచిన్న రాజ్యాలను ఏకం చేశాయని గుర్తు చేశారు. హైదరాబాద్​కు అనేక సంస్థలను కాంగ్రెస్​ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను ఎవరు నిర్మించారన్నారు. తాము చేసిన పనుల వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. ఆహార భద్రత చట్టాన్ని కూడా తెచ్చామని వివరించారు. భూసంస్కరణలు అమలు చేసి జమీందారీ వ్యవస్థను నిషేధించామన్నారు.

Congress Chevella Prajagarjana Sabha : "ఇంకా బ్యాంకులను జాతీయకరణ చేసిన పార్టీ కాంగ్రెస్​. హరిత విప్లవం, శ్వేత విప్లవం కాంగ్రెస్​ హయాంలోనే వచ్చాయి. ప్రతి ఒక్కరి చేతిలో సెల్​ఫోన్​ ఉందంటే దానికి కారణం రాజీవ్​గాంధీ ఆనాడు చేసిన కృషే. ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్​ కాదా.. ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్​ అధ్యక్షుడిని అయ్యాను. తాము చేపట్టిన కార్యక్రమాల వల్లే మహిళా అక్షరాస్యత 65 శాతమైందని" మల్లికార్జున ఖర్గే చెప్పారు.

Telangana Congress New Strategy : కాంగ్రెస్ స్మార్ట్ మూవ్.. ప్రియాంక, డీకేలకు తెలంగాణ గెలుపు బాధ్యతలు

Mallikarjuna Kharge Release 12 Points SC And ST Declaration చేవెళ్ల సభలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​.. విడుదల చేసిన ఖర్గే

"రేవంత్​ రెడ్డి ఇచ్చిన 12 అంశాల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. దేశ ఐక్యతకు కృషి చేస్తూ ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ ప్రాణాలు విడిచారు. మళ్లీ ఇప్పుడు రాహుల్​ గాంధీ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడమే కాంగ్రెస్​ సిద్ధాంతం."- మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

Telangana Election 2023 Congress Plan : విద్య,వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. ఇప్పుడు ఆనాడు తాము తెచ్చిన అనేక సంస్థలను మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆవేదన చెందారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడమే కాంగ్రెస్​ సిద్ధాంతమని అన్నారు. దేశ ఐక్యతకు కృషి చేస్తూ.. ఇందిర, రాజీవ్​ ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. ప్రజల మేలు కోసమే కాంగ్రెస్​ పార్టీ పని చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరించారు.

Revant Reddy on SC ST Declaration : 'అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తాం'

Congress MLA Tickets Applications 2023 : తరలివచ్చిన ఆశావహులు.. 1000 దాటిన దరఖాస్తులు

Last Updated :Aug 26, 2023, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details