ETV Bharat / state

Telangana Congress Party Released Campaign Poster : 'తిరగబడదాం- తరిమికొడదాం' నినాదంతో కాంగ్రెస్

author img

By

Published : Aug 12, 2023, 9:01 PM IST

Updated : Aug 12, 2023, 9:43 PM IST

Telangana Congress Campaign Poster
Telangana Congress Party Released Campaign Poster

Telangana Congress Party Released Campaign Poster : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ను​ గద్దె దించాలనే సంకల్పంతో కాంగ్రెస్​ పార్టీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. బీఆర్​ఎస్, బీజేపీ ఆగడాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు 'తిరగబడదాం-తరిమికొడదాం' అనే నినాదంతో ప్రచార పోస్టర్​ను విడుదల చేసింది. గెలుపే లక్ష్యంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ.. తోడు దొంగలు బీఆర్​ఎస్​, బీజేపీలపై ప్రజాఛార్జ్​ షీట్​ పేరుతో అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రజాకోర్టు నిర్వహించి ఆ రెండు పార్టీల బాగోతాలను ఎండగడుతోంది.

Telangana Congress Party Released Campaign Poster : తోడు దొంగలు బీఆర్​ఎస్​, బీజేపీలపై ప్రజాఛార్జ్​ షీట్​ పేరుతో 'తిరగబడదాం-తరిమికొడదాం' నినాదంతో ప్రచార పోస్టర్​ను కాంగ్రెస్​ నాయకులు విడుదల చేశారు. ఈ నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ను గద్దె దించడానికి ప్రచారం సాగిస్తామని కాంగ్రెస్​ శ్రేణులు తెలిపారు. సికింద్రాబాద్​ గాంధీ ఐడియాలజీ సెంటర్​ వద్ద నిర్వహించిన ప్రజాకోర్టులో ఏఐసీసీ ఇంఛార్జ్​ మాణిక్​ రావ్​ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీలు, వర్కింగ్​ ప్రెసిడెంట్​లు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఇతర కాంగ్రెస్​ పార్టీ నాయకులు పాల్గొని.. పోస్టర్​ను ప్రారంభించారు.

'తిరగబడదాం- తరిమికొడదాం' కాంగ్రెస్​ పార్టీ ప్రచార పోస్టర్​
'తిరగబడదాం- తరిమికొడదాం' కాంగ్రెస్​ పార్టీ ప్రచార పోస్టర్​

కాంగ్రెస్ మెనిఫెస్టో ప్రకటన వరకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. మెనిఫెస్టో ప్రకటన తర్వాత కాంగ్రెస్ విధానాలపై విస్తృత ప్రచారం చేయనుంది. తెలంగాణ కాంగ్రెస్​ మెనిఫెస్టో(Telangana Congress Manifesto)ను సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌ నిర్వహించే సభలో ఖర్గే పాల్గొననున్నారు. ప్రజాకోర్టు తెలంగాణ కాంగ్రెస్ నినాదమని ఇందులోనే మోదీ, కేసీఆర్‌లను నిలబెడుతామని కాంగ్రెస్ చెబుతోంది.

'తిరగబడదాం- తరిమికొడదాం' కాంగ్రెస్​ పార్టీ ప్రచార పోస్టర్​
'తిరగబడదాం- తరిమికొడదాం' కాంగ్రెస్​ పార్టీ ప్రచార పోస్టర్​

అమెరికాలో బాత్‌ రూమ్‌లు కడిగిన కేటీఆర్‌కు వాదానికి, వ్యాధికి తేడా ఏమి తెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, టీడీపీ మోసం చేసిందని కేసీఆర్ అంటే... ఆ రెండూ పార్టీల్లోనూ కేసీఆర్ ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ నష్టపోవడానికి కేసీఆర్​నే మొదటి ముద్దాయని పేర్కొన్నారు. తెలంగాణకు ద్రోహం చేస్తే ఉరితీయడం, పిండం పెట్టడం తెలంగాణ సంస్కృతినేనని పీసీసీ ప్రెసిడెంట్​ అన్నారు. తెలంగాణ పదమే ఇష్టం లేక పార్టీ పేరు మార్చిన వ్యక్తి కేసీఆర్​ అని రేవంత్​ దుయ్యబట్టారు.

'తిరగబడదాం- తరిమికొడదాం' కాంగ్రెస్​ పార్టీ ప్రచార పోస్టర్​
'తిరగబడదాం- తరిమికొడదాం' కాంగ్రెస్​ పార్టీ ప్రచార పోస్టర్​

Telangana Congress : కాంగ్రెస్​లో తాత్కాలికంగా ఆగిన చేరికలు.. ఆ తర్వాతనే మళ్లీ జోరు

Telangana Congress Party Campaign Poster : తెలంగాణ వాదానికి కేసీఆర్​కు సంబంధం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు గద్దర్​ లెజెండ్​ అని కొనియాడారు. ఆయన ఏ పదవి లేకుండా 55 ఏళ్లు ప్రజా పోరాటం సాగించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులు ఉన్నట్లు తెలంగాణలో గద్దర్​ పేరుతో అవార్డులు పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ట్యాంక్​బండ్​పై గద్దర్​ విగ్రహాన్ని పెడితే ట్యాంక్​బండ్​కు విలువు పెరుగుతుందన్నారు.

రాష్ట్రస్థాయిలో పొత్తులపై ఎలాంటి చర్చలు లేవని.. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఏఐసీసీ ఏమి చెబుతుందో చూడాలని రేవంత్​ రెడ్డి బదులిచ్చారు. కిషన్​రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో బండి సంజయ్​ను అడిగితే బాగా చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జ్​ మాణిక్​ రావ్​ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీలు, వర్కింగ్​ ప్రెసిడెంట్​లు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఇతర కాంగ్రెస్​ పార్టీ నాయకలు పాల్గొన్నారు.

'తిరగబడదాం- తరిమికొడదాం' కాంగ్రెస్​ పార్టీ ప్రచార పోస్టర్​
'తిరగబడదాం- తరిమికొడదాం' కాంగ్రెస్​ పార్టీ ప్రచార పోస్టర్​

"సీఎం కేసీఆర్​ ఉద్యమం సమయంలో నిధులు, నియామకాల పేరుతో మోసం చేశారు. ఎన్నికల సమయంలో డబుల్​ బెడ్​రూం ఇళ్లు, దళితబంధు వంటి సంక్షేమ పథకాలు అన్నారు. గద్దె ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. అందుకే ప్రజాకోర్టును ఏర్పాటు చేసి కల్వకుంట్ల కుటుంబాన్ని దోషులుగా చేసి.. ఈ ప్రజాకోర్టుకు కంచె ఐలయ్య జడ్జిగా వ్యవహరిస్తారు." - రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Congress Party Members For Elections 2023 : 60 నియోజక వర్గాల్లో కాంగ్రెస్​ పార్టీ సభ్యుల జాబితా సిద్ధం..!

Telangana Congress Party Released Campaign Poster 'తిరగబడదాం- తరిమికొడదాం' నినాదంతో కాంగ్రెస్

ప్రజాకోర్టు నిర్వహిస్తున్నా కాంగ్రెస్​ : ప్రజాకోర్టు నిర్వహిస్తున్న కాంగ్రెస్​.. ప్రజాకోర్టు న్యాయమూర్తిగా ప్రెఫెసర్​ కంచె ఐలయ్య వ్యవహరిస్తున్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై ఈ కోర్టులో కాంగ్రెస్​ విచారిస్తుంది. ప్రజా కోర్టు వేదికపై గద్దర్​కు నివాళిగా రెండు నిమిషాలు కాంగ్రెస్​ పార్టీ మౌనం పాటించింది. ప్రజా గాయకులు గద్దర్​, సియాసత్​ ఎడిటర్​ జహీర్​ అలీఖాన్​ అకాల మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

Telangana Congress New Strategy : కాంగ్రెస్ స్మార్ట్ మూవ్.. ప్రియాంక, డీకేలకు తెలంగాణ గెలుపు బాధ్యతలు

Congress BRS Raise Political Heat in Telangana : అగ్రనాయకులతో సభలు, ప్రచారాలు.. కాంగ్రెస్​ను గెలిపించేనా...?

Last Updated :Aug 12, 2023, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.