ETV Bharat / spiritual

బుద్ధ పూర్ణిమ విశిష్టత ఏంటి? ఆ రోజు ఏం చేయాలి? దీపాలు వెలిగించాలా? - Buddha Purnima 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 4:53 AM IST

Updated : May 23, 2024, 11:49 AM IST

Significance Of Buddha Purnima : అహింసా వాదాన్ని లోకంలో ప్రచారం చేసిన బుద్ధుని జయంతి మే23వ తేదీన జరుపుకుంటున్న సందర్భంగా బుద్ధ పూర్ణిమ విశేషాలు, బుద్ధ పూర్ణిమ ఎలా జరుపుకోవాలనే ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం.

Buddha Purnima
Buddha Purnima (Source : Getty Images)

Significance Of Buddha Purnima : బుద్ధ పూర్ణిమను బుద్ధుని జన్మదినం రోజున జరుపుకుంటాం. ఈ వేడుకలు ఇటు భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని బౌద్ధులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బుద్ధ పౌర్ణమిని మహా వైశాఖి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి ఆధ్యాత్మిక పనులు చేసినా తప్పకుండా విజయం సాధిస్తారని విశ్వాసం.

వైశాఖ పూర్ణిమకు బుద్ధునికి అవినాభావ సంబంధం
బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ రోజే మూడు సార్లు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి కాబట్టి బుద్ధుని జీవితంలో వైశాఖ పౌర్ణమికి ప్రాధాన్యం ఉంది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు సిద్ధార్ధుడిగా జన్మించారు. వైశాఖ పూర్ణిమ రోజే సిద్ధార్ధుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారారు. ఇదే వైశాఖ పూర్ణిమనాడు బుద్దుడు నిర్యాణం చెందారు.

బోధి వృక్షానికి పూజ మొదలైందిలా!
బుద్ధుడు చిన్నతనంలోనే తల్లి మరణించగా గౌతమి అనే స్త్రీ బుద్ధుని పెంచింది కాబట్టి బుద్ధునికి గౌతముడని పేరు వచ్చింది. బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజుల్లో ఒకనాడు భక్తులు పూలు తీసుకొని రాగా ఆ సమయంలో గౌతముడు అక్కడ ఉండడు. ఆయన కోసం ఎంతో సేపు ఎదురు చూసి భక్తులు తెచ్చిన పూలను అక్కడే విడిచిపెట్టి వెళతారు. బేతవన విహార దాత ఆనంద పిండకుడు అది చూసి పూలు పూజకు వినియోగం కాకుండా వృథా కావడం నచ్చక బుద్ధునితో తాను బయటకు వెళ్లేటప్పుడు తనకు సంబంధించిన పాదుకలు వంటి వస్తువులను వనంలో విడిచి వెళితే భక్తులు పూజలు చేసుకుంటారని చెబుతాడు.

బోధి వృక్షానికి పూజ
విగ్రహారాధన కానీ, శరీర భాగాలకు కానీ పూజలు జరపడానికి వ్యతిరేకి అయిన బుద్ధుడు భక్తులు తెచ్చిన పూలతో బోధి వృక్షానికి పూజలు చేయమని చెబుతాడు. అప్పుడు అక్కడ గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. ఆనాడు జరిగిన ఒక గొప్ప ఉత్సవంలో కోసల దేశపు రాజు తన పరివారంతో వచ్చి పాల్గొన్నాడు. వేలాది బౌద్ధ భిక్షవులు దేశదేశాల నుంచి తరలివచ్చారు. ఆనాటి నుంచి బోధి వృక్షానికి పూజ చేయడం ఆనవాయితీగా వచ్చింది.

వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ
ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్ధులకు ఎంతో ప్రత్యేకమైనది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్షపూజ జరపడం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్ధ మతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్షపూజ గొప్పగా జరుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి, దీపాలు వెలిగించి పరిమళ జలాన్ని పోస్తారు.

బుద్ధపూర్ణిమ వేడుకలు ఇలా!
బౌద్ధ మతాన్ని అనుసరించేవారు బుద్ధ పూర్ణిమ రోజు బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగరేస్తారు. బౌద్ధ స్తూపాన్ని ప్రార్థిస్తారు. ఈ రోజు బౌద్ధ మత గురువులకు పువ్వులు, అగరుబత్తులు, దీపాలు వంటివి సమర్పిస్తారు. పువ్వులు విడిపోతాయి. అగరుబత్తీల సువాసన, దీపాల వెలుగులు కొంతసేపటికి కనుమరుగవుతాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికే ఇవి గురువులకు సమర్పిస్తారు.

జ్ఞానోదయం
బుద్ధుడు మానవుని కష్టాలకు కారణం శోధిస్తూ దేశాటన చేస్తూ చివరకు గయలో బోధి వృక్షం కింద కోరికలే మానవుని దుఃఖానికి కారణమన్న నగ్నసత్యం తెలుసుకుంటాడు. ఏ బోధి వృక్షం కింద బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందో బుద్ధ పూర్ణిమ రోజు ఆ బోధి వృక్షాన్ని పూజిస్తారు.

బుద్ధపూర్ణిమ రోజు ఆచరించాల్సిన నియమాలు

  • వైశాఖ పూర్ణిమ/బుద్ధ పూర్ణిమ రోజు మద్య మాంసాలు తీసుకోరాదు.
  • పశువులు, పక్షులు మొదలు పురుగులతో సహా దేన్ని కూడా హింసించకూడదు.
  • పంజరాల్లో బంధించి ఉన్న పక్షులను స్వేచ్ఛగా వదిలి వేయాలి.

బౌద్ధాలయాల్లో ప్రత్యేక పూజలు

  • బుద్ధ పూర్ణిమ రోజు బౌద్ధాలయాల్లో ఒక పాత్ర నిండుగా నీళ్లు పోసి అందులో పువ్వులు వేసి వచ్చిన భక్తులను అందులో నీళ్లు పోయడానికి అనుమతిస్తారు. అలా చేయడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్మకం.
  • ఈ రోజు బౌద్ధాలయాల్లో సభలు, సమావేశాలు, ప్రార్థనలు, గౌతమ బుద్ధుని జీవన సరళిని, బౌద్ధమతాన్ని చాటే ఉపన్యాసాలు, ఊరేగింపులు వేడుకగా జరుగుతాయి. బుద్ధ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అహింసను చాటి చెప్పి కోరికలే మానవుని దుఃఖానికి కారణమని బోధించిన బుద్ధుని బోధనలను పాటించి వ్యాప్తి చేయడమే మనం బుద్ధునికి ఇచ్చే నిజమైన నివాళి. ఓం శాంతిః శాంతిః శాంతిః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కోర్టు సమస్యలు, తీరని కష్టాలా? నరసింహ జయంతి రోజు ఇలా చేస్తే అంతా సెట్​! - Narasimha Jayanti 2024

ఏ నక్షత్రం వారు ఎలాంటి రుద్రాక్ష ధరించాలి? నియమాలు కంపల్సరీనా? - Rudraksha According To Nakshatra

Last Updated : May 23, 2024, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.