తెలంగాణ

telangana

చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించారు: వైశాలి

By

Published : Dec 10, 2022, 8:00 PM IST

Dentist Vaishali on kidnapping incident రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన... హైదరాబాద్ మన్నెగూడ దంత వైద్యురాలి కిడ్నాప్ కేసు త్వరితగతిన దర్యాప్తు సాగుతోంది. దీనిపై బాధిత యువతి వైశాలి స్పందించారు. నవీన్‌రెడ్డికి తనకు పెళ్లి కాలేదని ప్రేమ లేదని... స్పష్టం చేశారు. తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించారని ఆరోపించారు.

Hyderabad Dentist Vaishali on kidnapping incident
Hyderabad Dentist Vaishali on kidnapping incident

Dentist Vaishali on kidnapping incident మన్నెగూడ అపహరణ కేసులో నవీన్‌రెడ్డికి తనకు పెళ్లి కాలేదని ప్రేమ లేదని... దంతవైద్యురాలు వైశాలి స్పష్టం చేశారు. పెళ్లి పేరుతో తమ కుటుంబాన్ని వేధించాడని.. తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించారని.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి అయ్యిందని చెప్పిన రోజున తాను ఆస్పత్రిలో ఉన్నట్లు చెప్పారు. తన జీవితాన్ని నాశనం చేస్తానని నవీన్‌రెడ్డి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్‌రెడ్డి నుంచి నాకు భద్రత కల్పించాలని కోరారు. తనకు సంబంధం లేకుండానే కారు ఇన్సూరెన్స్‌లో తన పేరు నామినీగా పెట్టారని అన్నారు.

అసలేం జరిగిందంటే..తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం కుదిరిందని, శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మన్నెగూడలోని ఆమె నివాసంలో నిశ్చయ తాంబూలాలకు ముహూర్తమని నవీన్‌ రెడ్డికి తెలిసింది. పెళ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు 5 కార్లు, డీసీఎం, ద్విచక్ర వాహనాల్లో సుమారు 100 మందితో నవీన్‌రెడ్డి.. యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నిఛర్‌ను, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఫోన్లు పగలగొట్టారు. అడ్డొచ్చిన యువతి తండ్రిని తీవ్రంగా కొట్టారు. తల్లిని పక్కకు నెట్టారు. ఓ బంధువుని ఇనుపరాడ్లతో కొట్టారు. యువతిని నవీన్‌రెడ్డి కారులో అపహరించుకు పోయాడు. సుమారు 40 నిమిషాల్లోనే ఇదంతా ముగిసింది. పక్కా రెక్కీతో అపహరణ జరిగినట్టు తెలుస్తోంది. సంఘటన జరిగిన 6 గంటలలోపే పోలీసులు అమ్మాయిని రక్షించారు.

చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించారు: వైశాలి

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details