తెలంగాణ

telangana

Fake Diamonds Fraud in Nalgonda : నకిలీ వజ్రాలు చూపించి.. రూ.లక్షలు దోచుకున్న ముఠా.. తస్మాత్ జాగ్రత్త!

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 1:01 PM IST

Fake Diamonds Fraud in Nalgonda : తమ వద్ద విలువైన వజ్రాలు ఉన్నాయని.. వాటిని ప్రత్యేక రసాయనాల్లో ముంచితే వాటికి రెట్టింపు ధర పలికి, రూ.కోట్లు వస్తాయని ఓ ముఠా ప్రజలను నమ్మించింది. ఇలా నమ్మి రూ.లక్షలు ఇచ్చిన కొందరు బాధితులు నిండా మునిగారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Fake Diamonds Gang Looting Crores of Rupees in Nalgonda
Fake Diamonds Gang Looting Crores of Rupees

Fake Diamonds Fraud in Nalgonda : జల్సాలకు, ఈజీ మనీకి అలవాటు పడిన ఓ ముఠా అమాయకులను టార్గెట్​ చేసింది. తమ వద్ద విలువైన వజ్రాలు(Diamonds) ఉన్నాయని నమ్మించి.. ఓ ప్రత్యేక రసాయనాల్లో ముంచితే వజ్రాలకు రెట్టింపు ధర పలికి, రూ.కోట్ల వజ్రాలు మీ సొంతం అంటూ ఆశ చూపింది. ఈ రసాయనాల కొనుగోళ్లకు రూ.లక్షలు కావాలని నమ్మించి(Cyber Crime).. సినీ ఫక్కీలో పలువురి వద్ద నుంచి నగదును దండుకుని నయా మోసానికి తెరలేపింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం సీత్యాతండాకు చెందిన ఉషా నాయక్​, బాలు, హైదరాబాద్​కు చెందిన తాలిబ్​ షేక్​లు ఈజీ మనీ కోసం ముఠాగా ఏర్పడ్డారు. అందుకు అమాయకులను టార్గెట్​ చేసుకున్నారు. వారి వద్ద విలువైన వజ్రాలు ఉన్నాయంటూ మిర్యాలగూడ, నాగార్జున సాగర్​, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో తిరుగుతూ పలువురిని మోసగించారు. ఈ క్రమంలో త్రిపురారం గ్రామానికి చెందిన నవ్య, శ్రీనివాస్​ దంపతులు గతంలో మిర్యాలగూడలో గోల్డ్​ షాపు నిర్వహించేవారు.

Fake Insecticides Selling Gang Arrested : నకిలీ, గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

Fake Diamonds in Nalgonda : ఆ సమయంలో వీరికి ఉషా నాయక్​, బాలులు పరిచయమయ్యారు. తమ వద్ద విలువైన వజ్రాలు ఉన్నాయంటూ.. వాటిని ముంబయి నుంచి తీసుకొచ్చే ప్రత్యేక రసాయనంతో శుభ్రం చేస్తే రెట్టింపు ధర వస్తుందని నమ్మబలికారు. భూమిలో పాతి విగ్రహాలను తీసినట్లు తమ వద్ద బంగారు నిధి ఉందంటూ నమ్మించి.. అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు.

Fake Loan Documents Gang Arrested in Hyderabad : నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసే గ్యాంగ్‌ అరెస్ట్.. రికవరీ వస్తువులు చూస్తే మైండ్‌ బ్లాక్‌

విలువైన వజ్రాలు మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఓ గదిలో ఉన్నాయని నమ్మించి.. శ్రీనివాస్​ వద్ద రూ.37.50 లక్షలు వసూలు చేశారు. అలాగే ధనావత్​ మంగ్త వద్ద రూ.5 లక్షలు.. విజయ్​కుమార్​ అనే వ్యక్తి వద్ద రూ.40 లక్షలు వసూలు చేశారు. అప్పుడే ముంబయి నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక రసాయనాల్లో డైమండ్​లు శుభ్రం చేస్తున్నట్లు నటిస్తూ.. అవి ఎంతకీ మారకపోవడంతో డైమండ్స్​ బాక్స్​ మారిందని సినీ ఫక్కీలో డ్రామాకు తెరలేపారు.

Telangana Cyber Crime News :ఎప్పటికీ వారు డైమండ్స్​ను తీసుకురాకపోవడంతో గట్టిగా అడిగితే ఎవరి డబ్బులు వారికి ఇస్తామంటూ కాలం వెళ్లదీశారు. ఇలా అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురి నుంచి సుమారు రూ.కోటి వరకు వసూలు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని.. పోలీసులు విచారణ ప్రారంభించారు.

E Cigarettes Selling Gang Arrest in Hyderabad : హైదరాబాద్​లో ఈ- సిగరేట్ల విక్రయ గ్యాంగ్​ అరెస్ట్​.. దర్యాప్తులో సంచలన విషయాలు..!

Cash On Delivery Fake Orders : క్యాష్ ఆన్​ డెలివరీతో బిగ్ స్కామ్.. ఫేక్ ప్రొడక్ట్స్​ ఇచ్చి, డబ్బులు కాజేసి..

ABOUT THE AUTHOR

...view details