తెలంగాణ

telangana

'అహింసా మార్గాన నడిచిన బాపూ జీవితం ఆచరణీయం'

By

Published : Oct 2, 2020, 2:27 PM IST

మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరు ఆచరించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన 151వ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

Gandhi Jayanthi celebrations 2020
బెల్లంపల్లిలో గాంధీ జయంతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు నిర్వహించారు. పాత జీఎం కార్యాలయం చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ ఆచరించిన సిద్ధాంతాలు అందరికీ ఆచరణీయమని అన్నారు.

పట్టణంలోని మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు గాంధీ జయంతిని నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింసా మార్గాన్ని అనుసరించిన మహాత్ముని జీవితం ఆచరణీయమన్నారు మున్సిపల్ ఛైర్​పర్సన్ జక్కుల శ్వేత.

ABOUT THE AUTHOR

...view details