తెలంగాణ

telangana

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి ఎక్కడా లేదు - గాల్లో వచ్చిన వాళ్లు గాల్లోనే పోతారు : బండి సంజయ్​

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 5:52 PM IST

Bandi Sanjay Election Campaign in Mahbubnagar : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్​ బీఆర్​ఎస్​ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్​, కాంగ్రెస్​లో ఎవరు ముఖ్యమంత్రి కావాలో వారిలో వారికే స్పష్టమైన అవగాహన లేదని బండి సంజయ్ అన్నారు. పాలమూరు వలసలు ఆగలేదని, వ్యవసాయ భూములు పచ్చగా మారలేదని ఆరోపించారు.

BJP Telangana election campaign 2023 in Mahbubnagar
Bandi Sanjay

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి ఎక్కడా లేదు గాల్లో వచ్చిన వాళ్లు గాల్లోనే పోతారు బండి సంజయ్​

Bandi Sanjay Election Campaign in Mahbubnagar :రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి ఎక్కడా లేదని, గాల్లో వచ్చిన వాళ్లు గాల్లోనే పోతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా బొక్కలోనిపల్లి కూడలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్​లో ఎవరిని గెలిపించినా.. వాళ్లు బీఆర్​ఎస్​లోనే చేరతారన్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లో ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న అంశంపై గొడవ మొదలైందని, ఒకరికిస్తే ఇంకొకరు పార్టీని వదిలి వెళ్లే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పొరపాటున బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లు అధికారంలోకి వస్తే మధ్యంతర ఎన్నికలు తథ్యమని జోస్యం చెప్పారు.

ఏడాదిలో వంద గదుల ఇళ్లు నిర్మించుకున్న కేసీఆర్​ పేదలకు మాత్రం ఇళ్లు ఇవ్వలేదని, కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్​ నిరుద్యోగులకు మాత్రం మొండి చేయి చూపారన్నారు. పాలమూరులో వలసలు ఆగలేదని.. పచ్చగా మారలేదన్నారు. పక్క రాష్ట్రం నీళ్లు తీసుకెళ్తుంటే కమీషన్లు తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్​హౌస్​లో ఉన్నారని బండి సంజయ్​ విమర్శించారు.మహబూబ్​నగర్​లో బీఆర్​ఎస్​ను గెలిపించి శ్రీనివాస్​గౌడ్​ను ఎమ్మెల్యే చేస్తే ఏం చేశారని ప్రశ్నించారు. ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు సహా సంక్షేమ పథకాలు ఎందుకు రాలేదని శ్రీనివాస్ గౌడ్​ను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే వర్గం కోసం పనిచేస్తున్నాయి : బండి సంజయ్

Bandi Sanjay Comments On KCR : కేంద్రం నుంచి మోదీ నిధులిస్తే రోడ్లు, పల్లెలు, పట్టణాలు బాగు చేసుకుని, కేసీఆర్​ ఫొటో పెడుతున్నారని దుయ్యబట్టారు. మహబూబ్​నగర్​కు మోదీ ఇచ్చిన నిధులెన్నో.. కేసీఆర్ ఇచ్చిన​ నిధులెన్నో.. లెక్క చెప్పమని మంత్రిని ప్రజలు నిలదీయాలన్నారు. ఎక్కడ కేసీఆర్​ మీటింగ్​ పెట్టినా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని.. డబ్బులు ఇచ్చినా ముఖ్యమంత్రి సభకు ఎవరూ రావడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నో కేసులు తనపై అధికార పార్టీ పెట్టిందని.. ప్రజల సమస్యలపై పోరాడి ఎన్నోసార్లు జైలుకు వెళ్లానని.. మైనార్టీ మహిళల కోసమే త్రిపుల్​ తలాక్​ రద్దు చేశారని తెలిపారు.

పాలమూరులో కాషాయ జెండా తప్పక ఎగురుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ నేతలు డబ్బులనే నమ్ముకున్నారని, ఓటుకు రూ.10వేలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఎంత డబ్బిచ్చినా తీసుకుని ఓటు మాత్రం బీజేపీకి వేయాలని సంజయ్​ కోరారు. ఇళ్లు, ఉద్యోగాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు రావాలన్నా, పాలమూరు పచ్చగా మారాలన్నా బీజేపీకి ఓటేయాలని సంజయ్ కోరారు. తెలంగాణలో మోదీ రాజ్యం వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారమిచ్చినా ఏం చేయని వాళ్లకు ఓటేస్తే ప్రజల బతుకులు ఎలా బాగుపడుతాయని ప్రశ్నించారు. మార్పు కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే కచ్చితంగా ఉపఎన్నిక వస్తుంది : బండి సంజయ్

పేదోళ్లు ఉద్యమం చేస్తే, పెద్దోళ్లు రాజ్యం ఏలుతున్నారు: బండి సంజయ్

కేసీఆర్​ మరోసారి సీఎం అయితే ఆర్టీసీ ఆస్తులను అమ్మేస్తారు : బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details