తెలంగాణ

telangana

ఈసారి ప్రజలు మోసపోతే - పదేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది : సీఎం కేసీఆర్

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 4:29 PM IST

Updated : Nov 17, 2023, 5:00 PM IST

CM KCR at Choppadandi Praja Ashirvada Sabha : ప్రజలు మోసపోతే పదేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో నీళ్లు ఎలా ఉండేవో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇలాంటివన్నీ ఆలోచించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జుట్లు, జుట్లు ముడేసి గొడవలు పెట్టారు తప్ప, రైతుల క్షేమం కోరలేదని ఆరోపించారు. ఎలక్షనొస్తే ఆగం ఆగం కావద్దని.. ఎవరో చెబితే వినొద్దని సూచించారు.

CM KCR at BRS Praja Ashirvada Sabha
CM KCR

ఈసారి ప్రజలు మోసపోతే - పదేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది : సీఎం కేసీఆర్

CM KCR at Choppadandi Praja Ashirvada Sabha :రైతుల కష్టాలు తీరేలా ఒక ప్రణాళిక రూపొందించామని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసింగించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొండగట్టు గతం ఎలా ఉండేదని.. ఇప్పుడు అక్కడ దివ్యధామంగా తీర్చిదిద్దుతామని వివరించారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కొండగట్టును అభివృద్ధి చేస్తామని హమీనిచ్చారు. కొండగట్టు అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామనిసీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు నీటి కోసం ఎన్నో బోర్లు వేసేవాళ్లమన్నారు. సాగునీటి పన్నులు రద్దు చేశామని, ధాన్యమంతా కొంటున్నామని స్పష్టం చేశారు. మిషన్‌ కాకతీయ కింద చెరువులు బాగు చేసుకున్నామని వివరించారు. రైతుబంధు వృథా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని ధ్వజమెత్తారు. రైతు భూమిపై ఎమ్మార్వోలు, తహశీల్దార్ల పెత్తనం వస్తుందని ఆరోపించారు. ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు పెరుగుతాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో 24 గంటలు మంచినీళ్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హమీనిచ్చారు.

2024 తర్వాత కేంద్రంలో బీఆర్‌ఎస్‌ కీలకం కానుంది : కేసీఆర్‌

'రైతుబంధు వేస్ట్ అనే పార్టీ కావాలా? ఇచ్చే పార్టీ కావాలా? రవిశంకర్​ను గెలిపిస్తే రైతు బంధు 16 వేలకు తీసుకుపోతాం. గ్రామాలలో మరో డేంజర్.. ధరణిని తీసేస్తరట. తీసేస్తే మీ భూములకు రక్షణ ఉండదు. మరో పథకం తెస్తామని మళ్లీ మేనిఫెస్టోలో చెప్పారు. భూ భారతి తెస్తారట. అది పాతదే. 30 ఏళ్ల కిందనే తెస్తే దాంతోటి ఏమీ కాలేదు. ధరణి ఉంటేనే రైతు బంధు వస్తుంది. తీసేస్తే ఏ పద్ధతిలో ఆ డబ్బులొస్తాయి. మళ్లీ పైరవీకారుల రాజ్యమొస్తుంది. రైతులకు మేలు చేసేటోడు కావాలా? కిందిమీద చేసేటోడు కావాలా?. కర్ణాటకలో 20 గంటల కరెంటు ఇస్తామని అన్నారు. ఇప్పుడు 5 గంటలు కూడా ఇస్తలేరు.' -కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి

BRS Praja Ashirvada Sabha Choppadandi :ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు రైతుల బాధలు పొయేలా ప్రణాళికలు రచించుకుని ముందుకు పోతున్నామనిసీఎం కేసీఆర్ చెప్పారు. భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి, దురదృష్టవాశాత్తు రైతు చనిపోతే రైతుబీమా ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఇక్కడ వరదకాలువ, కాకతీయ కాలువ ఉన్నా ఎన్ని ఎకరాలకు నీరందేదో తెలుసా? అని ప్రజలను ప్రశ్నించారు. వరదకాలువకు మోటార్లు పెడితే అప్పట్లో ఆ మోటర్లను తీసి నీళ్లలో పారేసేవాళ్లని తెలిపారు. ఇప్పుడా ఆ బాధ ఉందా? అని అడిగారు. కరెంట్ 3 గంటలు చాలట.. అందుకోసం 10 హెచ్​పీ మోటార్ పెట్టుకోవాలని కాంగ్రెస్ అంటుందని విమర్శించారు. మీకు 24 గంటలు కావాలా..? 3 గంటలు కావాలా..? ఎన్నిగంటలిచ్చే పార్టీ గెలవాలో మీరే నిర్ణయించాలన్నారు.

'24 గంటల కరెంట్ ఇచ్చే రాష్టానికి వచ్చి 5 గంటలు ఇస్తామని అక్కడి ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఆ సన్నాసికి ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నది తెలియదు. కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్లు సీఎంలుగా పనిచేసి కనీసం మంచి నీళ్లు కూడా మనకు ఇవ్వలేదు. ఆడబిడ్డ బిందె పట్టుకుని బజార్ల కనిపిస్తే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పాను. ఇప్పుడు మంచిగా నీళ్లుస్తున్నాం. ఇపుడు 24 గంటల పాటు నీళ్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం.' --కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి

బీజేపీకి మత పిచ్చి తప్ప ఏం తెలీదు - ప్రజలు అభ్యర్థుల గుణగణాలు విచారించి ఓటు వేయాలి : సీఎం కేసీఆర్

రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి : కేసీఆర్‌

Last Updated : Nov 17, 2023, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details