తెలంగాణ

telangana

తొలిసారి ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్న యువతరం

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 8:04 PM IST

Youth Hold Huge Percentage in Telangana Elections : ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు తొలి ఓటర్లు ఎదురుచూస్తున్నారు. గతంతో పోలిస్తే వీరి సంఖ్య భారీగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో యువత ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఈనెల 30న వీరి తీర్పు ఎటువైపు ఉండనుందో అనే ప్రశ్న అన్ని పార్టీల మదిని తొలిచివేస్తుంది.

Celebrities Awareness on Vote
Youth Hold Huge Percentage in Telangana Elections

Youth Hold Huge Percentage in Telangana Elections తొలిసారి ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్న యువతరం

Youth Hold Huge Percentage in Telangana Elections : ఈనెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లోతొలిసారి ఓటు వేసేందుకు యువతరం ఉవ్విళ్లూరుతుంది. రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 8లక్షల 11వేల 640మంది ఉన్నారు. ఇందులో గ్రేటర్ పరిధిలో లక్షా 70 వేలమంది ఓటర్లున్నారు. రంగారెడ్డిలో అత్యధికంగా 92వేల 540మంది, హైదరాబాద్ లో 77వేల 522మంది రానున్న (Youth Voters) ఎన్నికల్లో పాల్గొనున్నారు. పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు.

మనిషి జీవించడానికి ఆక్సిజన్​ ఎంత ముఖ్యమో- ఓటు అంతే ముఖ్యం

Voluntary Organizations Awareness Programs on Vote : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు వివిధ స్వచ్చంధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. కళాశాలల్లో ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓటు వేసి.. నచ్చిన నాయకుడిని ఎన్నికోవాలని కోరుతున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల ప్రక్రియలో మనం ఎంచుకునే ప్రభుత్వంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని యువకులుచెబుతున్నారు.

రైట్​ టు ఓట్ ​- ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్న యువత

ఉద్యోగ, ఉపాధి, మౌలిక వసతులు అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నారు. పోటీలో అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేయాలని కోరుతున్నారు. గత సార్వత్రిక (Telangana Elections) ఎన్నికలతో పోలిస్తే ఈసారి యువ ఓటింగ్‌ భారీగా పెరిగే అవకాశాలున్నాయి. అయితే కొత్త ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.

"మనం అందరం ఓటు వేయబోతున్నాం. ఆ రోజు కోపంతోనో, కసితోనో, డబ్బు మీద ప్రలోభంతోనో వేసేది ఓటు కాదు. ఓటు అనేది మన భవిష్యత్తుని తీర్తిదిద్దేది. కొద్దిగా రేవు ఏం జరుగుందో ఆలోచించండి. డబ్బులకో ఓట్లు కొనడం అందరు చేస్తున్నారు. అన్ని పార్టీలవారు చేస్తున్నారు. యువత భవిష్యత్ కాపాడాలి.. అందరికి మంచి జీవితం కావాలి, ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ కల్పన ఆశా కిరణం నాకు కనిపిస్తోంది. ఎవరు దానికి దోహదం చేస్తున్నారు. రేపు ఏ పార్టీ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందో యువత ఆలోచించి ఓటు వేయాలి." - జేపీ ప్రకాశ్, లోకసత్తా పార్టీ నాయకుడు

యువతా మేలుకో - ఓటువేసి నీ తలరాత నువ్వే రాసుకో : రజత్ కుమార్

Celebrities Awareness on Vote : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కును ఓటు కల్పిస్తుందని.. అలాంటి ఓటును దుర్వినియోగం చేయవద్దని కోరుతున్నారు. ముఖ్యంగా పోటీలో ఉన్న ఏ ఒక్కరు నచ్చకపోతే కనీసం నోటాకైనా ఓటు వేయాలని చెబుతున్నారు. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి వేలుకి సిరా చుక్క ఉండాలని కోరుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన మైనార్టీల ఓట్లు - దక్కేదెవరికో మరి?

ఓటు విషయంలో తగ్గేదేలే అంటోన్న వందేళ్ల బామ్మ - ఈమెను చూసైనా

ABOUT THE AUTHOR

...view details