రైట్​ టు ఓట్ ​- ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్న యువత

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 8:05 AM IST

thumbnail

First Time Voters in Warangal 2023 : ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు.. ప్రతి ఒక్కరు తమ ఓటును ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది ఎంతో పవిత్రమైనది. దానికి ఎంతో సార్థకత ఉంది. ఓటును నోటుకు అమ్ముకోకుండా విలువైన ఆయుధంగా మల్చుకోవాలి. ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని 'ప్రజాస్వామ్య' పద్ధతిలో ఎన్నుకోవాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

Voter Awareness in Telangana Election 2023 : రాష్ట్రంలో ఎన్నికలవేళ మొదటిసారి ఓటు హక్కు కలిగిన పౌరులు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారు. ఎలాంటి నాయకున్ని ఎంచుకుంటారు.. తమ అవసరాలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తొలి ఓటు వినియోగంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. వరంగల్ జిల్లా బుల్లికుంట ఫార్మసీ కళాశాలలో తొలి ఓటు హక్కు కలిగి మొదటిసారి ఓటు వేయాలనుకుంటున్న విద్యార్థులను తమ అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.